నడిరోడ్డు పైన పాయింట్ బ్లాక్ లో యువతీ హత్యా

 

(ఫరీదాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

మహిళల సంరక్షణ కోసం ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా రోజు రోజుకి మహిళల,యువతులు పైన జర్గుతున్న దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. హత్రాస్ ఘటన మరువక ముందే తాజాగా యువతిని పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపిన ఘటన హరియాణా లో ని ఫరీదాబాద్ లో జరిగింది. నిఖిత అనే 21 ఏళ్ళ యువతీ బీ.కామ్ డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షా రాసేందుకు కళాశాలకు వచ్చింది. ఈ క్రమంలో తౌసీఫ్ అనే యువకుడు తన స్నేహితుడు కలిసి కార్ లో వచ్చి నిఖిత ని కార్ లో ఎక్కించేందుకు ప్రయతనించగా ఆమె ప్రతిఘటించడం తో నడిరోడ్డు మీదనే నిఖితను పాయింట్ బ్లాక్ రేంజ్ లో గన్ తో షూట్ చేసాడు. ఆమె అక్కడే కుప్పకూలిపోగా తౌసీఫ్ అదే కార్ లో తప్పించుకున్నాడు.

ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి.ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరియాణలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై భారీ ఆగ్రహం చెలరేగింది.నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలి అన్ని తక్షణమే ఆ కుటుంభానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు తౌసీఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిఖిత ను ఇస్లాం మతం మార్చుకోవాలి అని తౌసీఫ్ వేధిస్తున్నాడు అన్ని,పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు యువతీ కుటుంబ సభ్యులు తెలిపారు . మతం మార్చుకోవడానికే ఒప్పుకోలేదు అనే కారణం తో నే ఈ రోజున తన బిడ్డ ని కాల్చేచంపేసాడు అన్ని నిఖిత తండ్రి ఆవేదన వ్యక్తం చేసారు.