స్నేహితులతో పార్టీకి వచ్చిన ప్రియురాలు.. బిల్ చూసిన ప్రియుడు?

ప్రేమికుల లోకమే వేరు..ముఖ్యంగా జాబ్ చేసేవారైతే ఈ గజిబిజీ లైఫ్ కు కొంత సేపు పుల్ స్టాప్ పెట్టి మరీ ప్రేయసితో సరదాగా గడపాలని కోరుకుంటారు. కొందరు పార్కులని, మరికొందరు పార్టీలకనీ, సినిమాలకు, షికార్లకనీ తిరగుతుంటారు. ఇలాగే ఓ వ్యక్తి కూడా తన ప్రేయసితో సరదాగా గడపాలని డేటింగ్ కు ప్లాన్ చేశాడు. అదే అతని కొంప ముంచింది. ప్రియుడు చేసిన పనికి ప్రేయసే తన మీద కేసుకూడా పెట్టింది. అదేంది కేసు ఎలా పెడుతది అని అనుకుంటున్నారా.. అయ్యో అదే నిజమండి.. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చదివేయండి మరి..

చైనాలోని జోజియాంగ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నారు. వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దానిని లవ్ స్టేజికి ఆహ్వానం పంపడానికి ఇద్దరూ కలిసి డేటింగ్ కు ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం ఓ రెస్టారెంట్ ను కూడా డిసైడ్ చేసుకున్నారు. అక్కడే వారిరువురూ ముఖాముఖి చూసుకోవాలని ఆశపడ్డారు.

అనుకున్నట్టుగానే అనుకున్న సమయానికి యువకుడు రెస్టారెంట్ చేరుకుని ఆమె రాక కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో అతని ప్రేయసి దర్శనమిచ్చింది. దానితో పాటు తన వెంట 23 మంది స్నేహితులను, బందువులను వెంటబెట్టుకుని వచ్చి అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పకుని కడుపును కాళీగా ఉంచకుండా దాన్ని నింపేశారు. వెయిర్ బిల్లును తీసుకువచ్చి ఆ యువకునికి అందజేశారు. అందరూ కలిసి చేసిన విందు తాలుక బిల్లును చూసి ఆ యువకుని గుండె గుబేలు మంది. మరి అందెంతో తెలుసా సుమారు19,800 యునాన్లు(మన కరెన్సీలో రూ.2 లక్షల 17 వేలు). దానితో ఆ యువకుడు షాక్ నుంచి తేరుకుని ఒక్క ఉదుటున లేచి చుట్టుపక్కల కూడా చూడకుండా పరుగందుకున్నాడు.

దీనితో ఆ యువతీ మాట్లాడుతూ.. తన ప్రియుడు తొలిసారిగా కలుసుకునేందుకు బ్లయిండ్ డేట్ కు ప్లాన్ చేసుకున్నామని తెలిపింది. తనతో పాటుగా 23 మందిని వెంటేసుకుని రెస్టారెంట్ కు వెళ్లానని చెప్పింది. అయితే తామంతా కలిసి తిన ఫుడ్ కు ఆ యువకుడు బిల్లు కట్టలేక పారిపోయాడని తెలిపింది. దాంతో వారే బిల్లును చెల్లించామని చెప్పుకొచ్చింది. ఈ ఘటన జరిగిన తరువాత ఆ యువతీ యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆ యువకుడు తన స్థాయికి తగ్గట్టు కేవలం రెండు టేబుళ్ల బిల్లు చెల్లించేదుకు ఒప్పుకున్నాడు.