బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుని, పెళ్లి అయ్యాక కూడా స్టార్ డమ్ ని అదే రేంజ్ లో కొనసాగిస్తున్న బాలీవుడ్ నెం.1 స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె చేతిలో అనేక సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీ బిజీ గా ఉంది. ఆమె ఇప్పటికే అయిదు పెద్ద సినిమాలకు ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ ముద్దుగుమ్మ మన దేశంలో వందల కోట్ల రూపాయలతో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తుంది. అయితే, దీపికా పారితోషికం ప్రస్తుత ఇండియన్ హీరోయిన్స్ పారితోషికాలలోనే అత్యధికం అనొచ్చు. ఈమె బాలీవుడ్ హీరోలతో పోటీగా పారితోషికం అందుకుంటుంది అంటేనే ఈమెకు బాలీవుడ్ లో ఏ రేంజులో క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
ఇంత బిజీ బిజీ గా ఉండే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో తన గురించి మాట్లాడుతూ తాను సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఇంటికి కావాల్సిన వస్తువులు, సరుకులను వగైరాలన్నీ తానే స్వయంగా కొనుగోలు చేసి వాటిని తానే సర్దుకుంటానని చెప్పుకొచ్చింది. ఆలా చేసుకుంటేనే తనకి తృప్తిగా ఉంటుందట. అటు సినిమాలను ఇటు ఇంటిని బాలన్స్ చేస్తూ ఒక మోడరన్ వైఫ్ గా ఉంటోంది దీపికా పదుకొనె.
తాజాగా ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఒక మీడియా సంస్థతో ముచ్చటిస్తున్న సమయంలో చెప్పుకొచ్చింది. తాను షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఇంటి పనులు చేయడం వల్ల కాస్త ప్రశాంతత అనిపిస్తుందని అందుకే ఇంటికి కావాల్సినవి తానే కొనుక్కుంటానని వాటితో పాటుగా ఇంటి పనులు కూడా చేసుకుంటూ ఉంటాను అని అంటోంది. ఇదంతా చూసే రణవీర్ సింగ్, అంత బిజీ షెడ్యూల్ ఉండే నీకు ఇంతగా ఇంటి పనులలో కల్పించుకోవడం అవసరమా అంటాడట.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…