బంగారం అంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు ఎంతో నచ్చే మాట మాత్రమే కాదు.. దానితో చేసే ఆభరణాలు అన్నా అంతే ఇష్టం. అందుకే అమ్మాయికి అబ్బాయిలే కాదు తన ఫ్యామీలీ కూడా పండగలకు బంగారు ఆభరణాలు గిఫ్ట్ గా ఇస్తుంటారు. అలాగే అమ్మాయిలు కూడా తనకు నచ్చిన వ్యక్తికి బంగారంతో చేసిన చేతి గొలుసులు గిఫ్ట్ గా ఇస్తుంటారు.
బంగారానికి ఉన్న డిమాండ్ అట్లాంటిది. బంగారం కేవలం మనకు అందాన్ని తీసుకొచ్చే ఆభరణం మాత్రమే కాదు. మన లెవల్ ను చూపించుకునే ఆయుధం కూడా. అలాగే అత్యవసర సమయంలో ఆదుకునే బంధువు కూడా. అవును అత్యవసర సమయంలో మనుషులను నమ్మరేమో కానీ బంగారాన్ని నమ్మి అప్పుమాత్రం ఇస్తారు. అందుకే బంగారాన్ని కొనేందుకు పేదొళ్ల నుంచి బడా బాబుల వరకు క్యూ కడుతారు. అందుకే వీధికో బంగారం షాపులు ఓపెన్ అవుతున్నాయి.
అయితే బంగారాన్ని కొనాలంటే ఇన్ని రోజులు బంగారం దుకాణాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడా వెళ్లకుండా నట్టింట్లోనే కొనే వేసులుబాటును కొన్ని సంస్థలు తీసుకొచ్చాయి. దాంతో క్షణాల్లో బంగారం కొనొచ్చు. అలాగే మీరు వాడే వాట్సాప్ ద్వారా కూడా గిఫ్ట్ గా మీకు నచ్చిన వారికి పంపించొచ్చు. అది ఎలా అంటారా..? చాలా సులభం. బంగారం కొనేందుకు ఎన్నో మార్గాలు ఉన్నా విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు వచ్చిన డిజిటల్ గోల్డ్ మనకు పలు ఆప్షన్లు ఇస్తోంది.
అందులో సేఫ్ గోల్డ్ ఆప్షన్ చాలా మంచి ఆఫ్షన్. దీంతో ఆన్లైన్లోనే బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఈ సేఫ్ గోల్డ్ తో పేటీఎం, ఫోన్‌పే వంటి సంస్థలు కూడా భాగస్వాములుగా మారాయి. ఇందులో బంగారాన్ని కొంటే వాట్సాప్ లో కూడా ఇతరులకు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. సేఫ్ గోల్డ్ అకౌంట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత సులభంగా బంగారాన్ని పంపిచ్చొచ్చు. అలాగే సేఫ్ గోల్డ్ లో అకౌంట్ లేనివారికి కూడా ఈ బంగారాన్ని పంపొచ్చు. అయతే ఈ బంగారాన్ని ఫిజికల్ గా కూడా తీసుకునే వెసులుబాటును సేఫ్ గోల్డ్ అందిస్తోంది.