NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మహిమలు, మాయలూ రాయల్ ఎన్ ఫీల్డ్ కి గుడి..! ఎక్కడో చుడండి..!!

 

దేవుళ్లకు గుడి కడతాం .. ఇంకాస్త పైత్యం ఎక్కువైతే నాయకులకు , సినిమాతారలకు కడతాం .. ఈ మధ్యనే తెల్ల ఎలుకలకు గుడి కట్టిన విషయం తెలిసిందే .. ఇప్పుడు దేవుడు,మనుషులు,ఎలుకల నుండి బైకుల వరకు పాకింది.. ఇదే వరసలో ఇప్పుడు ఏకంగా బైక్ కి గుడి కట్టారు..! ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం.. అయితే ఆ గుడికి “బుల్లెట్ బాబా” అని పేరు.. ఇంతకీ ఎక్కడో, ఏంటో మీకు తెలుసా..? అయితే దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.!

 

bullet baba temple

చాలామంది వాహనప్రియులు ఎక్కువగా ఇష్టపడే ద్విచక్ర వాహనాలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి . మాములుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ చూడటానికి చాలా లగ్జరీగా ఉంటుంది. అంతేకాకుండా ఒక హుందా రైడింగ్ ని ఇస్తుంది. మన దేశీయ మార్కెట్లో కూడా వీటి అమ్మకాలు యమా జోరుగా ఉన్నాయి. సాధారణంగా అందరికి రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఒక బైక్ అని మాత్రమే తెలుసు. కానీ మనదేశంలో అక్కడ ఏకంగా గుడి కట్టి పూజించేస్తున్నారు..రాజస్థాన్ రాష్ట్రంలో జోద్‌పూర్‌కు 47 కిమీల దూరంలో ఉన్న పాలి జాతీయ రహదారి పక్కన ఓం బన్నా అనే పేరుతో బుల్లెట్ బాబా గుడి ఉంది. ఎక్కడైనా ప్రజలు తమకు ఇష్టమైన దేవతలను వివిధ రకాల నమ్మకాలతో ఎంతో భక్తిగా పూజించడం మనం చూసాం, కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కి అక్కడ గుడి కట్టి అనునిత్యం పూజలు చేస్తున్నారు.

 

ఓం బన్నా చరిత్ర :
ఎందుకు ఇలా చేస్తున్నారు, దీని వెనుక ఉన్న చరిత్ర పుటల్ని మనం తిరగేసినట్లైతే ? డిసెంబర్ 2, 1988 వ సంవత్సరం ఓం సింగ్ రాథోడ్ (ఓం బన్నా) తన రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ బైక్ పై చోటిలా అనే ఊరికి బయల్దేరాడు. గ్రామానికి కొంత సమీపంలోనే బైక్ ఒక చెట్టుకు ఢీ కొనింది. దీంతో ఓం బన్నా పక్కనే ఉన్న ఒక గుంతలో పడిపోయాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని ఆ బైక్ ను పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. పోలీసులు బుల్లెట్‌ను పోలీస్ స్టేషన్ లో పెట్టిన తర్వాత మరుసటిరోజు ఆ బుల్లెట్ మాయమై ఓం సింగ్ రాథోడ్ ఎక్కడైతే మరణించాడో అక్కడే ఉంది. అయితే పోలీసులు ఎవరో ఆకతాయిలు కావాలని ఈ బైక్ ను తీసుకు వచ్చి ఇక్కడ పెట్టి ఉంటారు అనుకున్నారు. దాన్ని మళ్ళీ దానిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈ సారి పోలీసులు బైక్ లోని పెట్రోల్ మొత్తం తీసేసారు. అయినప్పటికీ తర్వాత రోజు పోలీస్ స్టేషన్ లో మాయమై అదే ఘటనా స్థలంలో కనిపించింది. పోలీసులు ఎన్ని సార్లు ఈ బైక్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పటికీ అది మళ్లీ మళ్ళీ అదే స్థలానికి చేరుకునేది. దీంతో పోలీసులు ఆ బుల్లెట్ బైకుని అక్కడే వదిలేశారు.

 

అయితే స్థానికులు ఇదంతా ఓం బన్నా (ఓం సింగ్ రాథోడ్) ఆత్మ ఇలా చేస్తున్నాడని నమ్మారు. నమ్మడమే కాదు ఓం బన్నా దేవునితో సమానమని భావించి ఆ గుంత దగ్గరే గుడి కట్టి “బుల్లెట్ బాబా” అనే పేరు పెట్టారు. ఇంకా దానికి పూజలు చేయడం కూడా మొదలుపెట్టారు. మొదట్లో ఆ గుడికి స్థానికులు తప్పా ఇతరులు వచ్చేవారు కాదు. కానీ కాలక్రమంలో స్థానికులు ఓం బన్నా ఆత్మా తిరుగుతున్నాడని, పూజిస్తే కోరికలు తీరుస్తాడని గట్టిగా విశ్వసించారు. మెల్లమెల్లగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ గుడికి రావడం మొదలుపెట్టారు. రోడ్డుపై వెళ్లే వారు ఈ గుడిని దర్శించి వెళ్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని అక్కడివారు గట్టిగా నమ్మేశారు. బుల్లెట్ బాబా నిజంగా కోరికలు తీరుస్తాడా.. మీరు కూడా ఈ బుల్లెట్ బాబా దేవాలయాన్ని చూడాలనుకుంటున్నారా.. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్‌పూర్ దగ్గర ఉన్న చోటిలా గ్రామాన్ని ఒకసారి తప్పక చేసేయండి మరి.

 

author avatar
bharani jella

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju