Weekend: వీకెండ్ కి ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడికి వెళ్ళండి !!

Share

Weekend: వీక్ ఎండ్ వస్తుందంటే ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. కొన్ని సార్లు మన దగ్గర లో ఉన్న బీచ్, సహజమైన ప్రకృతి అందాలను మర్చిపోతుంటాం.. ఏపీ లో ఉన్న కొన్ని బీచ్ ల గురించి తెలుసుకుందాం.బెస్తవారు  ఉండే ఒక  చిన్న గ్రామం మంగినపూడి.  మచిలీపట్నం  కు  11 కి.మీ దూరంలో ఉంది    ఇక్కడ సముద్రం  లోతు తక్కువగా ఉంటుంది.  సముద్రం  ఒడ్డున ఉన్న నాట్యశాల లో  విద్యార్థులకు కూచిపూడి నృత్యం  లో శిక్షణ ఇస్తారు.  ఆ ఒడ్డునే దత్తాశ్రమం, పురాతన శివాలయం ఉన్నాయి. ఈ  సముద్రపు ఒడ్డున   లింగాకారం పోలిన    12 బావులు  కలవు.  ఒక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క రుచి ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు  హాయి గా  గడపటానికి ఇక్కడ అనువైన వాతావరణం  ఉంటుంది.కార్తీక పౌర్ణమికి అయితే భక్తుల  రద్దీ  బాగా ఉంటుంది.    బీచ్ ఒడ్డున  పార్క్ కూడా ఉంటుంది.

ఈ  సముద్రం  మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంటుంది  కాబట్టి ఆటోలలో లేక బస్సు లలో కూడా వెళ్ళవచ్చు.  సూర్యలంక బీచ్, బాపట్ల.. ఇదిబాపట్ల కి  9 కి.మీ. దూరంలో   ఉంది.  ఇక్కడ ప్రకృతి యొక్క సహజమైన అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. సహజసిద్ధమైన ఈ సముద్రం ఈత కొట్టడానికి..   వారాంతపు సెలవు లు గడపటానికి  మంచి ప్రదేశం గా చెప్పుకోవచ్చు.
విజయవాడ-ఒంగోలు వెళ్లే రైలు మార్గంలో బాపట్ల వస్తుంది.  బాపట్ల వెళ్ళడానికి రైలు ,బస్సుల సౌకర్యం కూడా కలదు.
ఓడరేవు బీచ్ ఇది చీరాల  కి 6 కి.మీ. దూరం లో  గుంటూరుకు అయితే 35 కి.మీ. దూరంలో ఉంది.    గుంటూరు నుంచి బస్ , రైలు మార్గం  లో  చీరాల కి  చేరుకోవచ్చు. వీక్ ఎండింగ్స్ కి హాలిడేస్ కి   ప్రశాంతంగా గడపటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి స్థానికులు,  పర్యాటకులు వస్తుంటారు.   ఇక్కడ ఉండాలనుకుంటే, చీరాల లో   స్టే చేయవచ్చు.కొత్తపట్నం బీచ్ ఇది ఒంగోలు పట్టణానికి 18 కి.మీ. దూరంలో  ఉంది. వీక్ ఎండింగ్స్ ఎంజాయ్ చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి స్థానికులు మరియు పర్యాటకులు  వస్తుంటారు.


మోటుపల్లి బీచ్ ఇది చీరాల  కి  12 కి.మీ. దూరంలో ఉంది. ఈ మోటుపల్లి పురాతనమైన రేవు పట్నం. బౌద్ధమత స్థూపాలు , విహారాలకు మోటుపల్లి ప్రసిద్ధిగాంచింది. మోటుపల్లి లో చాలా పురాతనమైన శ్రీరామచంద్రుని ఆలయం  ఉంది.
కాకినాడ నుండి 5 కి. మీ. దూరంలో ఉప్పాడ బీచ్   ఉంది. విశాలమైన ఈ  సముద్రం ఈతకు, స్నానాలకు  చాలా సురక్షితమైనది. బిజీ లైఫ్  నుండి దూరం గా ప్రశాంతంగా  గడపటానికి ఇది చాలా అనుకూలమైన  ప్రదేశం.
కాకినాడ యన్.టి.ఆర్ బీచ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో  ఈ బీచ్ పర్యాటకులకు  సంతోషాన్ని పెంచుతుంది. అద్దాల వంతెన, మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్ షోలు ఇక్కడకు వచ్చిన పర్యాటకులను ఆకర్షిస్తాయి. దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ వంతెన కు ఇది  ప్రత్యేకమైనది.సాల్ట్ వాటర్ లో ఏర్పాటు చేసిన లేజర్ షో మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంటుంది.


Share

Related posts

AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్..! మాన్సాస్ ట్రస్ట్ జీవో కొట్టివేత..!!

somaraju sharma

కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

sarath

కాస్త దృష్టి పెట్టు జ‌గ‌న్‌…. అనుకోకుండా బుక్ అయిపోతున్నారు

sridhar