Gold Smuggling: ఆ మహిళలకు ఆ డబ్బు, బంగారం ఎలా వచ్చింది..!? శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆరా..!

Gold Smuggling: Three Women Arrested in Airport
Share

Gold Smuggling: విదేశాల నుండి డబ్బు, బంగారం, ఇతర వస్తువులు తెచ్చినప్పుడు కచ్చితంగా లెక్కలు చూపించాలి. తగిన బిల్లు, ఆధారాలు చూపించాలి.., లేకపోతే కస్టమ్స్ అధికారులు కష్టపెట్టేస్తారు.. అనవసరంగా కష్టాల్లోకి ఇరుక్కుపోతారు.. విమానాశ్రయాల్లో తరచూ అనధికార బంగారంతో దొరికిపోతుండడం మనం చూసే ఉంటాం. ఇది మొత్తం స్మగ్లింగ్ కిందకు వస్తుంది.. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇద్దరు మహిళల నుండి భారీగా నగదు, బంగారం పట్టుబడింది. వారు దీనికి సంబందించిన లెక్కలు చూపకపోవడం, ఆధారాలు లేకపోవడం.. ప్రశ్నించినా సరైన సమాధానం లేకపోవడంతో కటకటాలపాలయ్యారు.. వేర్వేరు ఘటనల్లో కస్టమ్స్‌ అధికారులు ముగ్గురు మహిళా ప్రయాణికులపై మూడు కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ. 29 లక్షలకుపైగా విలువైన విదేశీ కరెన్సీ, మరో సుమారుగాగా కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదట సోమవారం మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి రూ. 11.49 లక్షలు విలువ చేసే యుఏఈ కరెన్సీ‌, యుఎస్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. వీరిద్దరిపై అక్రమ విదేశీ కరెన్సీని తరలిస్తున్నారనే అభియోగాలపై కేసులు నమోదు చేశారు. అలాగే దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు వచ్చిన మరో మహిళా ప్రయాణికురాలి నుంచి నిన్న సాయంత్రం రూ. 17. 69 లక్షలు విలువ చేసే మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుండి తరచూ బంగారం అనధికారికంగా వస్తుండడంతో శంషాబాద్, చెన్నై, తిరువనంతపురం, బెంగుళూరు ఎయిర్ పోర్టులో నిఘా పెరిగింది..!

Gold Smuggling: Three Women Arrested in Airport
Gold Smuggling: Three Women Arrested in Airport

Share

Related posts

Big Boss: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రగతి..!!

sekhar

Perni Nani: పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారన్న మంత్రి పేర్ని నాని..!!

somaraju sharma

పవన్ కళ్యాణ్ కోసం ఆలోచించకుండా అలాంటి నిర్ణయం తీసుకున్న దిల్ రాజు..!

GRK