NewsOrbit
న్యూస్

Golden Brunei King : ఆ రాజు వైభోగం చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే.. ప్రతి అంగుళం బంగారుమయం..!

golden-brunei-king-hassanal-bolkiah

Golden Brunei King : సాధారణంగా ఒక దేశాన్ని పాలించే రాజుల పిల్లలు బంగారానికి ,వజ్ర, వైఢూర్యాలకు ఏ మాత్రం కొదువ ఉండదనే సంఘటనలను మనం సినిమాలలోనే చూస్తుంటాం. కానీ ఇప్పటికీ నిజజీవితంలో అలాంటి వారు ఉన్నారా? అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రాజుని చూస్తే మాత్రం అతను రాజా? లేక అపర కుబేరుడా? అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరైనా అక్కడ అంతా ఆయన చెప్పు చేతల్లోనే జరగాలి. ఇతని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అతనే అతనే ”ద గ్రేట్ సుల్తాన్.. బ్రూనై రాజు హస్సనల్ బొల్కియా”..!!

golden-brunei-king-hassanal-bolkiah
golden brunei king hassanal bolkiah

బంగారం అంటే ఎంతో ఇష్టం ఉన్నా ఈ రాజు ఇంటిలో ప్రతి అంగుళం బంగారు మయమే.తన ఇంటిని బంగారు తాపడంతో 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత లగ్జరీ ప్యాలెస్ ను నిర్మించాడు. ఒక ఇల్లు మాత్రమే కాకుండా బంగారంతో పూత పూసిన విమానం కూడా కలదు. ఈ రాజు గారి ప్యాలెస్ లో ఏకంగా ఏడు వేల లగ్జరీ కార్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఇతని ప్యాలెస్ లో ఉన్నాయి.

బ్రూనై రాజు హస్సనల్ బొల్కియా సంపాదన మామూలుగా ఉండదు. ఊహించటానికే సాధ్యం కాదు. ప్రస్తుతం ఈయన అధికారంలో లేకపోయినా అన్ని విషయాలు ఈయన చెప్పు చేతుల్లోనే జరుగుతాయి. బంగారం అంటే ఎంతో ఇష్టమైన ఈ రాజు తనకు ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న రాజమందిరానికి బంగారు పూత పూయించాడు. ఈ ప్యాలెస్ గోపురాలకు 22 క్యారెట్ల బంగారంతో పూత పూయించాడు.ఈ ప్యాలెస్ లో 1700 కి పైగా గదులు, 257 బాత్రూంలు, ఐదు స్విమ్మింగ్ పూల్స్, 110 గ్యారేజీలు, గుర్రాలకు ప్రత్యేకంగా 200 ఎయిర్ కండిషన్డ్ గదులున్నాయి. ఇవే కాకుండా తన ప్యాలెస్ లో ఉపయోగించే డైనింగ్ టేబుల్, ఫ్లవర్ వాజ్, మంచాలు, బాత్ టబ్ కూడా బంగారంతో తయారుచేసినదే ఈ రాజు వైభోగం చూస్తే మనకు కళ్ళు తిరగాల్సిందే.

రాజు హస్సనల్ బొల్కియాకు ఏడు వేల కార్లున్నాయి. అవన్నీ లగ్జరీ కార్లే. ఆ కార్లలో కొన్నింటికి బంగారంతో కోటింగ్ వేయించాడు. అదేవిధంగా విమానానికి కూడా బంగారు పూత పూయించారు. ఆ విమానంలో అనేక సౌకర్యాలు అందులో ఉన్నాయి.ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన సుల్తాన్లనో ఒకరిగా రికార్డు క్రియేట్ చేశారు. 1980 వరకు ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుడు హోదాను అనుభవించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని గురించి మరెన్నో ఆశ్చర్యపరిచే విషయాలను తెలుసుకోవచ్చు.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju