‘పవన్‌’కి ఆల్ ద బెస్ట్ చెప్పిన గవర్నర్

కర్నూలు, ఫిబ్రవరి 27: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆల్ ద బెస్ట్ చెప్పారు.

కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని కడప జిల్లాకు వెళుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం అహోబిలం నర్శింహస్వామిని దర్శించుకున్నారు. అదే సమయంలో స్వామివారి దర్శనానికి గవర్నర్ నరసింహన్ వచ్చారు.

గవర్నర్ దంపతులను పవన్ మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో పవన్‌కు గవర్నర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు.

ప్రజలు అందూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు పవన్ చెప్పారు.

అనంతరం పవన్ దువ్యూరు, మైదుకూరు మీదుగా కడపకు బయలుదేరారు.

సాయంత్రం అయిదు గంటలకు దేవుడి కడప నుండి అన్నమయ్య బొమ్మ సెంటర్ వరకూ జరిగే రోడ్‌షోలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారు.