good bacteria: శరీరంలో మంచి బాక్టీరియా పెరగాలంటే ఇలా చేయాలి..!!

Share

good bacteria: బాక్టీరియా అంటే వాటితో మనకు అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ వాస్తవానికి మనకు మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. బాక్టీరియా, వైర‌స్‌లు, ఇత‌ర సూక్ష్మ క్రిముల‌ వల్ల మనకు వ్యాధులు వస్తాయని అంద‌రికీ తెలిసిందే. వాస్తవానికి మంచి చేసే బాక్టీరియా మ‌న శ‌రీరంలో జీర్ణాశ‌యం, పేగుల్లో ఉంటుంది. ఆ బాక్టీరియా కారణంగానే మ‌నం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణ‌మ‌వుతుంది. అదే విధంగా క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు రాకుండా చూడ‌డంలో, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా మంచి బాక్టీరియా మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. మంచి బాక్టీరియాను మన శరీరంలో ఎలా పెంచుకోవాలి, అందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

good bacteria how to grow in our body

ప్రొ బ‌యోటిక్స్
ప్రొ బ‌యోటిక్స్ అధికంగా ఉండే పాలు, పాల ఉత్ప‌త్తులు, ప‌ప్పులు, సోయా ఉత్ప‌త్తులు త‌దిత‌ర ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం సుల‌భంగా తీసుకుంటుంది. అదే విధంగా చెడు బాక్టీరియా న‌శిస్తుంది.
ఫైబ‌ర్
ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) ఎక్కువ‌గా ఉండే తాజా ఆకు కూర‌లు, కూర‌గాయ‌లు, పండ్లు త‌దిత‌ర ఆహారాల‌ను రోజు తీసుకుంటే కూడా మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉండటంతో పాటు శరీరంలో నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
షుగ‌ర్
మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియాను పెంచుకోవాలంటే చ‌క్కెర‌ను చాలా త‌క్కువ‌గా తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ పూర్తిగా మానివేస్తే ఇంకా మంచిది. చ‌క్క‌ర వ‌ల్ల మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియా నశించడమే కాకుండా చెడు బాక్టీరియా పెరుగుతుంది. ఫ‌లితంగా బాక్టీరియా, వైర‌స్‌, ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు వచ్చే అవ‌కాశం ఉంటుంది.
బుర‌ద
ప్ర‌కృతి వైద్యంలో బుర‌ద‌తో చికిత్స ఉంటుంది. ఎందు కంటే బుర‌దలో మ‌న శ‌రీరానికి మేలు చేసే బాక్టీరియా ఉంటుంది. అందుక‌ని వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా బుర‌ద‌ను ఒంటికి రాసుకుని త‌డి ఆరిపోయాక స్నానం చేస్తే చాలు. లేదంటే మ‌ట్టిలో కాసేపు ఆట‌లాడినా మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది.
నిద్ర
మంచి బాక్టీరియా పెరిగేందుకు నిత్యం క‌నీసం 7 నుంచి 9 గంట‌ల పాటు క‌చ్చితంగా నిద్ర పోవాలి. నిద్రలేమి వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కనీసం ఏడు 8 గంటలు నిద్ర పోతే శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
వ్యాయామం
రోజు పొట్టుకు సంబంధించిన వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. మ‌న శ‌రీరంలో అన్ని అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ప‌నిచేస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

30 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

33 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago