Good luck sakhi : గుడ్ లక్ సఖి..మహానటి ఫేం సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ సినిమా. లేటెస్ట్ సినిమా అయినా గత ఏడాది ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ కరోనా గుడ్ లక్ సఖి రిలీజ్ కాకుండా అడ్డుపడింది. పెంగ్విన్ సినిమా రిలీజైంది. కీర్తి సురేష్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా. పెద్ద సాహసమే చేసింది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ ప్రయోగమే..మిస్ ఇండియా అనే సినిమాతో వచ్చింది. ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న కీర్తి సురేష్ ని మిస్ ఇండియా కూడా బాగా డిసప్పాయింట్ చేసేసింది.
ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలా వద్దా అనే నిర్ణయంలో కొంత క్లారిటీ కావాలన్నా, రావాలన్నా ఇప్పుడు గుడ్ లక్ సఖి విడుదల అయి తీరాల్సిందే. మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఆలోచనకి వచ్చారు. దాంతో సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. గుడ్ లక్ సఖీని ఓటీటీలో ప్రేక్షకులకు అందిస్తారని. అంతక ముందు రెండు సినిమాలు కూడా ఈ విధంగా ఓటీటీ రిలీజైనవే. ఇక్కడే ఓ నెగిటివ్ సెంటిమెంట్ కూడా వినిపిస్తోంది. ఓటీటీలో వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కాబట్టి గుడ్ లక్ సఖి ఆ లిస్ట్ లో ఎక్కడ చేరుతుందో అని మాట వినిపిస్తోంది.
Good luck sakhi : గుడ్ లక్ సఖి చిత్రం ఎంత వరకు ఆకట్టుకొని కీర్తి సురేష్ కి హిట్ ఇస్తుందో.
కానీ ఈ చిత్ర నిర్మాతలు కొట్టి పారేశారు. గుడ్ లక్ సఖి చిత్రం మేము థియేటర్స్ లో మాత్రమే విడుదల చేసి ఆ తర్వాత కొన్నాళ్ళు ఆగి ఓటీటీలోకి తీసుకు వస్తామని చెప్పారు. మేకర్స్ నుంచే నేరుగా క్లారిటీ రావడంతో ఇక రూమర్స్ కి చెక్ పెట్టినట్టైంది. జగపతి బాబు, యంగ్ హీరో ఆదిపినిశెట్టి గుడ్ లక్ సఖి లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. కీర్తి సురేష్ ఇందులో చాలా నేచురల్ గా కనిపించబోతోంది. తను మాట్లాడే స్లాంగ్ కూడా చాలా కొత్తగా ఉంది. మరి ఈ గుడ్ లక్ సఖి చిత్రం ఎంత వరకు ఆకట్టుకొని కీర్తి సురేష్ కి హిట్ ఇస్తుందో. ప్రస్తుతం ఈమె చేతిలో సర్కారు వారి పాట, అన్నాత్తే చిత్రాలు ఉన్నాయి.