Ali Reza: బిగ్ బాస్ సీజన్ 3 లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ అలీ రెజా అందరికీ సుపరిచితమే. హౌస్ లో కీలకంగా అప్పట్లో రాణించి.. టాప్ ఫైకి కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ లో ఆ సీజన్ లో.. అలీ రెజా ని మించిన వారు లేరు. అన్ని రకాలుగా అలరించిన అలీ రెజా సీజన్లో మధ్యలో ఎలిమినేట్ అవటం మళ్లీ ఫైనల్ కి చేరుకున్న సమయంలో ఇంట్లోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అలీ రెజా.. వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. టైటిల్ విన్నర్ కాకపోయినా గానీ చాలా మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.
ఈ క్రమంలో బయటకు వచ్చాక అనేక సినిమా అవకాశాలు అందుకుంటూ ఆర్టిస్ట్‌గా గతంలో కంటే ఇప్పుడు తన కెరియర్ మెరుగుపరుచుకుని.. దూసుకుపోతున్న అలీ రెజా.. తండ్రి అవుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. భార్యతో కలిసి ఓ వీడియో చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో అలీ భార్య బేబీ బంప్‌తో దర్శనం ఇచ్చారు. ఇది చూసిన అతడి సన్నిహితులు, నటీనటులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సావిత్రి అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన అలీ రెజా మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించు కోవడం జరిగింది. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లో మరింత క్రేజ్ రావడంతో… సినిమా ఇండస్ట్రీలో పలు ప్రాజెక్టుల లో అనేక అవకాశాలు అందుకుంటూ.. కెరియర్ మూడు పూలు.. ఆరు కాయలు అన్నట్టు..గా చూసుకుంటున్నారు. ఈ తరుణంలో అలీ రేజా తండ్రి అవుతున్నట్లు సోషల్ మీడియాలో తెలియజేయడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.