యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్. గతంలో కూడా మల్టీస్టారర్స్ వచ్చినా ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి ఈ మధ్య కాలంలో నటించింది లేదు. అందుకే ఆర్ ఆర్ ఆర్ పై మొదటి నుండి అందరికీ ఆసక్తి.
అందులోనూ ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. అందులోనూ ఇద్దరి పోరాట యోధుల జీవితంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా, తెలంగాణ విప్లవ నాయకుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు.
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయిపోయింది. 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని భావించారు. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా వైరస్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూట్ నిలిచిపోయింది. అయితే దాదాపు ఏడు నెలల తర్వాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను నిన్నటి నుండి ప్రారంభించిన విషయం తెల్సిందే. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. దాదాపు రెండు నెలల పాటు ఈ షెడ్యూల్ ను కొనసాగించనున్నారు. ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి రామ్ చరణ్ స్పెషల్ వీడియోను విడుదల చేసిన సంగతి తెల్సిందే.
అయితే కరోనా వైరస్ కారణంగా ఎన్టీఆర్ స్పెషల్ వీడియోను విడుదల చేయలేకపోయారు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్న విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు షూట్ తిరిగి మొదలవ్వడంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్పందించింది. రేపు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ఇస్తామని తెలిపింది. అయితే ఇది కచ్చితంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోదే అని ఫిక్స్ అయిపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. చూడాలి మరి అది ఎటువంటి అప్డేట్ అన్నది.