సినిమా హాళ్ళు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి బిగ్ గుడ్ న్యూస్ !

ఓ వైపు క‌రోనా మ‌హమ్మారి ఉధృతి కొన‌సాగ‌డం మ‌రోవైపు తీవ్రంగా ప్ర‌భావితం అయిపోయిన జ‌నజీవ‌నం తిరిగి గాడిన ప‌డేందుకు పోరాటం చేస్తున్న త‌రుణం ఇది.

ఒక్కో విభాగానికి సైతం ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇలాంటి త‌రుణంలో అన్‌లాక్ నిబంధ‌న‌లు విడుద‌ల అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు నిబంధ‌న‌లు వెల్ల‌డ‌య్యాయి. అయితే, అన్ లాక్ 5లో ఎలాంటి నిబంధ‌న‌లు ఉండనున్నాయ‌నే ఆస‌క్తి పెరుగుతోంది.

అన్ లాక్ 4లో ఏమున్నాయి?

క‌రోనా వైర‌స్ ప్రభావం ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాలు త‌ప్ప మిగిలిన రాష్ట్రాల్లో అన్ లాక్ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం, వంద మంది మించకుండా..సామాజిక, విద్య, స్కూల్స్, మతపరమైన పొలిటికల్ సమావేశాలకు అనుమతి ద‌క్కింది. 50 మందితో పెళ్లిళ్లు జ‌రుపుకోవ‌చ్చు. అంత్యక్రియలకు 20 మంది హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. ఓపెన్ థియేటర్లు అనుమతి ఇచ్చారు. సినిమా థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులకు అనుమతి ఇవ్వలేదు.

ఇప్పుడు సినిమా థియేట‌ర్ల‌ వంతు

అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల కానున్న అన్ లాక్ 5లో సినిమా హాళ్లు తెరుచుకోనున్న‌ట్లు చెప్తున్నారు. అక్టోబ‌ర్ నెలలో పెద్ద ఎత్తున పండుగ‌లు ఉండ‌టం, ఇప్ప‌టికే కీల‌క‌మైన ప‌లు సేవ‌లు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో థియేట‌ర్లు తెరుచుకునేందుకు కేంద్రం ఓకే చెప్పేస్తుంద‌ని పేర్కొంటున్నారు. ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇప్ప‌టికే థియేట‌ర్లు తెరిచేందుకు ఓకే చెప్పేశాయి.

మీ కోసం ఇవి చేయండి

నాలుగు ద‌ఫాలుగా అన్ లాక్ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రావ‌డం, త్వ‌ర‌లో 5వ మార్గ‌ద‌ర్శ‌కాలు సైతం వెలువ‌డ‌నున్న త‌రుణంలో ప్ర‌జ‌ల్లో మునుప‌టి సీరియ‌స్‌నెస్ పోయింద‌ని అనుకోవ‌చ్చు. అయితే, ప్ర‌జ‌లంతా త‌మ ఆరోగ్యం కోణంలో సూచ‌న‌లు పాటించాల‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

1. వ్యక్తిగత పరిశుభ్రత:

క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్నందున‌ వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త చాలా అవ‌స‌రం. చేతులు శుభ్రంగా ఉంచుకోవ‌డం, ఆల్కాహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజ‌ర్ల‌ను వినియోగించ‌డం, చేతుల‌తో ముఖాన్ని తాక‌కుండా చూసుకోవ‌డం, సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తీసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి

2. ప్రజా రవాణా:

ప్ర‌యాణాల విష‌యంలో ఎక్కువ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వ్యాపారాలు, పాఠ‌శాల‌లు, క‌మ్యూనిటీ సంస్థ‌ల సేవ‌లు ప్రారంభం కావ‌డంతో ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. త‌ప్ప‌ని స‌రిగా సొంత వాహ‌నాన్ని వినియోగించాలి. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప..ప‌నుల నిమిత్తం ద‌గ్గ‌ర ప్రాంతాలైతే కాలిన‌డ‌క‌న‌, లేదంటే సైకిల్ మీద వెళ్లడం ఉత్తమం.

3. మాస్క్ లు ధ‌రించాలి:

ప్ర‌తీ ఒక్క‌రు మాస్కులు ధ‌రించాలి. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు…ఎవ‌రైనా కుటుంబ‌స‌భ్యులు మీ ఇంటికి వ‌చ్చేట‌ప్పుడు మాస్క్ లు ధ‌రించాలి. చిన్న‌పిల్ల‌లు, వ‌యోవృద్ధులు, శ్వాస ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవాళ్లు మాత్రం ప్ర‌త్యామ్నాయ మార్గాల్ని అన్వేషించ‌డం మంచిది.

4. సోష‌ల్ డిస్టెన్స్ :

ఎక్క‌డికి వెళ్లినా మ‌నిషికి మ‌నిషికి సుమారు 6అడుగులు దూరంలో ఉండేందుకు ప్ర‌య‌త్నం చేయాలి.

5. రోగనిరోధక శక్తి:

క‌రోనా వైర‌స్ నుంచి సుర‌క్షితంగా ఉండాలంటే ప్ర‌తీఒక్క‌రిలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ చాలా అవ‌స‌రం. ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఉండ‌డం వ‌ల్ల క‌రోనా మ‌న ద‌రిచేర‌దు. పోష‌క ఆహారం తీసుకోవ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్లు, మ‌త్తు ప‌దార్ధాల‌కు దూరంగా ఉండ‌డంతో పాటు ఒత్తిడి నుంచి దూరం అయ్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్యులు చెబుతున్నారు.