కరోనా వ్యాక్సిన్ పై అద్దిరిపోయే న్యూస్…! ఇక రెడీ అయిపోవడమే….

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు అప్పుడే మొదలయ్యాయి. కోవిడ్ కారణంగా మరొక సారి దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుందని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెకండ్ వేవ్ మొదలైందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇచ్చారు. ప్రపంచంలో కొన్ని దేశాలు అయితే లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఇక ఇదే సమయంలో మూడవ దశ పూర్తి చేసుకున్న పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీకి రెడీ అయ్యాయి అని సమాచారం వచ్చింది.

 

మరి కొన్ని నెలలే…

ఇలాంటి సమయంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. కరోనా ని అరికట్టే వ్యాక్సిన్ గురించి ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ పంపిణీపై మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక భేటీ అయిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే…. ముందుగా ఎవరికి వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ భేటీ ఉపయోగపడనుంది. ఇక దీన్ని బట్టి చూస్తే మరొక రెండు మూడు నెలల్లో వ్యాక్సింగ్ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

ముందు వాళ్ళకే….

ముందుగా ఎప్పటి నుందో తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం ఆరంభంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మొదటిగా వ్యాక్సిన్ ను అందజేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. అతి ప్రధానంగా ఆరోగ్య కార్యకర్తలకు డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది.

కోటికి పైనే….

మొదటిగా ఒక కోటి మంది ప్రజలకు ఇవి అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం జులై 2021 నాటికి దాదాపు 20 కోట్ల నుండి 25 కోట్ల మంది ప్రజలకు 400 మిలియన్ల నుండి 500 మిలియన్ల డోస్ ల వరకు అందుబాతులోకి రానున్నట్లు అంచనా వేస్తున్నారు, ఇక ఈ మొత్తంలో వ్యాక్సిన్ విడుదలైతే వైరస్ ను పూర్తిగా అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యాక్సింగ్ అతిత్వరగా విడుదలయ్యే ఈ మహమ్మారి నుండి బయటికి తీసుకు రావాలని అందరూ ఆశిస్తున్నారు.