ట్రెండింగ్ న్యూస్

రైతుల‌కు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ. 36 వేలు పొందే అవ‌కాశం!

good news to farmers earn 36 thousand for a year
Share

ప్ర‌ధాన న‌రేంద్ర మోడీ దేశంలోని రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ప‌థ‌కాల‌ను తీసుకు వ‌చ్చి అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో దేశంలోని రైతులంద‌రికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్న ప‌థ‌కం కిసాన్ స‌మ్మాన్ నిధి. ఈ ప‌థ‌కం ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని రైతుల‌కు మూడు విడ‌త‌ల్లో రూ. 6వేల‌ను వారి ఖాతాల్లో జ‌మ చేస్తోంది. ఇప్పుడు మ‌రో స్కీం తో రైతుల‌కు మ‌రింత లాభం చేకుర్చేందుకు కేంద్రం సిద్ద‌మైంది.

good news to farmers earn 36 thousand for a year

 

ఆ స్కీం పేరే.. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ స్కీంలో రైతులు చేర‌డం వ‌ల‌న 60 ఏళ్ల త‌రువాత పెన్ష‌న్ పొందే అవ‌కాశం ఉంది. ఈ ప‌థ‌కానికి అర్హులు కావాలంటే రైతుల‌కు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫండ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటూ ఉంటే.. రైతులకు ఈ స్కీమ్ తో మంచి లాభం చేకురుతుంది. ఈ స్కీమ్ లో చేరే రైతులు వారి వయస్సును బట్టి రూ. 55 నుంచి రూ. 200 వరకు ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి. వయస్సును బట్టి ఈ ప్రీమియం చెల్లింపులో మార్పులు చేర్పులు ఉంటాయి.

మ‌న దేశంలోని 21 లక్షల మంది రైతులు ఇప్పటికే ఈ స్కీమ్ లో చేరిపోయారు. ఈ స్కీమ్ కు అర్హులైన రైతులు ఎంత త్వ‌ర‌గా చేరితే అంత మంచి ప్ర‌యోజ‌నాల‌ను ఆస్వాధించొచ్చు. త్వరగా చేరితే తక్కువ ప్రీమియం చేల్లించాల్సి వ‌స్తుంది. అలాగే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. దేశంలోని రైతులు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరొచ్చు. అయితే 5 ఎకరాల లోపు పొలం ఉంటే మాత్రమే ఈ స్కీమ్ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌డానికి అర్హులు. సమీపంలోని బ్యాంక్ లను, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ లను సంప్రదించి ఈ స్కీం గురించి తెలుసుకోవ‌చ్చు.


Share

Related posts

AP Assembly: ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు ఒక రోజు సస్పెన్షన్

somaraju sharma

పార్లమెంట్ సాక్షిగా ఏపి రాజకీయం..! ఎంపిల వ్యూహాలు ఎవరివి వారివే..!! 

Special Bureau

వైసీపీ -బీజేపీ కలయిక..! ఒక బాణం మూడు పిట్టలు..!!

Special Bureau
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar