న్యూస్

Work From Home: ఇది గుడ్ న్యూసో, బ్యాడ్ న్యూసో మీరే తేల్చుకోండి! ఇకనుండి వీరు ఇంటికే పరిమితం!

Share

Work From Home: కరోనా కష్టకాలం తరువాత దాదాపు అన్ని IT, BPO కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానం అనుసరించాయి. సరిగ్గా కరోనా ఫస్ట్ వేవ్ తరువాత సదరు కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుకి పిలుద్దాం అనుకొనే లోపు 2nd వేవ్ వచ్చిపడింది. దాంతో దాదాపు 2 సంవత్సరాలుగా వీరు ఇంటికే పరిమితం అయ్యి, తమ విధులను నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడైనా వారిని తమ యాజమాన్యం ఆఫీసుకి పిలుస్తారు అనుకుందామంటే.. కరోనా ఓమైక్రాన్ రూపంలో మనవాళిపైన మరోమారు దాడికి సిద్ధమైంది. దాంతో పలు కంపెనీలు తమ ఉద్యోగులను పూర్తిగా ఇంటినుండి వర్క్ చేయమని ఆదేశిస్తున్నాయి.

Bheemla Nayaak: న్యూ ఇయర్ రోజు “భీమ్లా నాయక్” సరికొత్త సందడి..!!

Work From Home: ఇంతకీ ఏఏ కంపెనీలు ఈ నిర్ణయానికి వచ్చేయంటే..

ముందుగా ట్విట్టర్ గురించి తెలుసుందాం. ఈ సోషల్ మీడియా కంపెనీ తమ ఉద్యోగులను ఇంటినుండి పనిచేయమని ఆదేశించింది. ఈ కోవలోనే సాఫ్ట్ వేర్ వేదిక అయినటువంటి స్లాక్ తమ ఉద్యోగులకు శాశ్వత వర్క్ ఫ్రం హోంను ప్రకటించడం విశేషం. ఇక అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని శాశ్వతం చేసింది. వారంలో 50 శాతానికి మించకుండా ఉద్యోగులు ఎప్పుడైనా ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటును కల్పించింది. అలాగే మెటా-ఫేస్ బుక్ కూడా తమ ఉద్యోగులకు కరోనాతో నిమిత్తం లేకుండా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని ఇచ్చింది.

KTR: సోము సారు చీప్‌ లిక్కర్ స్కీమ్‌‌పై స్పందిన కేటిఆర్..! ఈ బీజేపీ జాతీయ పాలసీ ఏపికేనా..?
ఇంకా ఏయే కంపెనీలు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాయి అంటే..

క్లౌడ్ ఆధారిత సంస్థ అయినటువంటి షాపీ ఫై కూడా తమ ఉద్యోగులకు ఎప్పటికీ ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్నికల్పించింది. అలాగే స్వీడన్ కు చెందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ వేదిక స్ఫూటిఫై.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో పాటు ఆఫీస్ నుంచి పనిచేయాలా?.. ఇంటి నుంచే పనిచేయాలా? అనే నిర్ణయం ఉద్యోగులకే వీరు వదిలేసారు. దాంతో సదరు ఉద్యోగులు దాదాపు అందరూ ఇంటినుండి పనిచేస్తామని చెప్పి, ఇళ్లనుండే తమ విధులను నిర్వహిస్తున్నారట!


Share

Related posts

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

somaraju sharma

Israel: మిడిల్ ఈస్ట్ లో సరికొత్త రాజకీయ వాతావరణం..!!

sekhar

గుళ్ళో శఠగోపం తలమీద పెట్టినప్పుడు ఏం జరుగుతుంది !

Kumar