న్యూస్

LIC: LIC పాలసీ దారులకు ఈ విషయం తెలుసా? ఆ కార్డు మీకు ఉచితంగానే లభిస్తుంది!

Share

LIC:ప్రముఖ బీమా సంస్థ అయినటువంటి LIC తన పాలసీ దారులకు అదిరిపోయే వార్త చెప్పింది. తన పాలసీ దారులకు, ఏజెంట్లకు ఉచితంగా క్రెడిట్ కార్డుని పొందే వెసులుబాటు కల్పించనుంది. ఈ క్రమంలోనే IDBI బ్యాంక్ సహకారంతో LIC CSL ఇటీవల రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ క్రెడిట్ కార్డును లుమైన్ కార్డు, ఎక్లాట్ కార్డుల పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. ఈ క్రెడిట్ కార్డులు ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్లు, సభ్యులు, పాలసీదారులకు ప్రత్యేకంగా లభించనుంది.


Childern: పిల్లలు కూడా లావుగా ఉండకూడదా.. ఇదేం కొత్త అధ్యాయనం..! ఏమైనా సమస్యలోస్తయా..!?

LIC: ఈ కార్డుల వలన కలిగే లాభాలు ఇవే..

ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనం ఈ కార్డు ద్వారా LIC ప్రీమియం చెల్లించినట్లయితే రెట్టింపు రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. అలాగే పెట్రోల్ బంకుల వద్ద ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా ఉంటుంది. కాగా ఈ రెండు క్రెడిట్ కార్డులను LIC, IDBI బ్యాంక్ కలిసి సంయుక్తంగా అందిస్తున్నాయి. ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే.. ఈ కార్డులకు ఎలాంటి మెంబర్‌షిప్ ఫీజులు కానీ లేదా యాన్యువల్ ఫీజులు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు.

Mango videos: మ్యాంగో వీడియోస్ సంస్థ కార్యాలయంపై గౌడ సంఘీయుల దాడి..ఎందుకంటే..?
వీటివలన కలుగు ఇతర ప్రయోజనాలు:

1. లూమిన్ కార్డుపై రూ.100 వెచ్చిస్తే 3 డిలైట్ పాయింట్లను పొందవచ్చు.
2. ఎక్లాట్ క్రెడిట్ కార్డుపై రూ.100 వెచ్చిస్తే 4 డిలైట్ పాయింట్లు వస్తాయి.
3. ఈ కార్డుల ద్వారా రూ.400 కంటే ఎక్కువ లావాదేవీ చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రియంబర్స్‌మెంట్ ఉంటుంది.
5. LIC IDBI ఎక్లాట్ కార్డు హోల్డర్స్‌కు దేశీయ, అంతర్జాతీయ విమానశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సస్ కూడా లభిస్తుంది.
6. 3000 కంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా కొంటే, వాటిని తేలికగా EMI రూపంలోకి మార్చుకోవచ్చు.
7. ఈ క్రెడిట్ కార్డులకు కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. రూ.5 లక్షల వరకు సమ్ అస్యూర్డ్ లభిస్తుంది. ఈ రెండు క్రెడిట్ కార్డుల వ్యాలిడిటీ 4 ఏళ్లు.


Share

Related posts

KCR: కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం… ఖ‌జానాకు కాసులు

sridhar

ఇండిపెండెన్స్ డే స్పెషల్: మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా పోస్టర్ విడుదల

Vihari

ఆయన్ను ఎందుకు విచారించినట్లో ?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar