హీరోయిన్ సమంత బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ ఉంది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తున్న సమంత.. బాలీవుడ్ లో కూడా భారీ అవకాశాలు అందుకుంటుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరియర్ ఫుల్ బిజీగా మారిపోయింది. చేతినిండా సినిమాలతో పాటు.. వెబ్ సిరీస్ లు చేస్తుంది.
ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన “పుష్ప” లో “ఉ అంటావా” అనే ఐటమ్ సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా సమంత పేరు మారుమొగింది. అంతగా ఈ సాంగ్ వైరల్ అయింది. సమంతా అభిమానులు సైతం ఈ సాంగ్ నీ బాగా ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే తరహా సాంగ్ సమంత నటిస్తున్న “యశోద” సినిమాలో మేకర్స్ ప్లాన్ చేయటం జరిగింది అంట. ఫస్ట్ టైం హీరోయిన్ ఓరియంటెడ్ గా పాన్ ఇండియా నేపథ్యంలో.. సమంత సినిమా చేస్తుంది. ఒక సాంగ్ మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది.
అయితే ఈ ఒక్క సాంగ్ పుష్ప లో ఉ అంటావా అనే సాంగ్ మాదిరిగా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మంచి మాస్ బీట్ ప్లాన్ చేయటం జరిగిందట. కచ్చితంగా “యశోద” సినిమాలో ఈ సాంగ్ హైలెట్ గా ఉంటుందని ఆ తరహా లోనే సమంత కూడా మాస్ స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి.. విడుదల తేదీని సినిమా యూనిట్ ప్రకటించనుంది.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…