Samantha: సమంత.. ఓ మరపురాని మాయలేడి. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’తోనే తెలుగు ప్రేక్షకుడి హృదయాలను కొల్లగొట్టిన మాయల మారి. అంతటితో ఆగిందా.. ఆ సినిమాలో నటించిన అక్కినేని వారసుడు అయినటువంటి నాగ చైతన్యను సైతం మాయ చేసి ఏకంగా పెళ్లి చేసుకుంది. తరువాత జరిగిన పరిణామాలు మీకు తెలియనివి కాదు. ఎంతో అన్యోన్యంగా జీవించిన వీరు సడెన్ గా విడాకులు తీసుకుంటూ అక్కినేని అభిమానులకు షాక్ ఇచ్చారు. దాంతో ఓ వర్గవారు అమ్మడి పని అయిపోయిందని అనుకున్నారు.
Samantha: సమంతతో రోజూ జిమ్ చేయించే ఆ కుర్రాడు.. సమంత బాడీ గురించి అలా అనేశాడు ఏంటి!
Samantha: ఫుల్ ఫామ్ లో సామ్!
అవును.. విచిత్రంగా విడాకుల తరువాత సామ్ మరింత పుంజుకుంది. ఓ వైపు శాకుంతలం, మరో వైపు యశోధ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మంచి ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. తాజాగా మరో అద్భుతమైన అఫర్ సామ్ తలుపు తట్టింది. అవును… మన రౌడీ బాయ్ హీరో విజయ్ దేవర కొండ సరసన హీరోయిన్ గా ఫిక్స్ అయింది సామ్. శివనిర్వాణతో హీరో విజయ్ ఓ సినిమా చేయాలి. సదరు ప్రాజెక్ట్ కోసమే సామ్ తలుపు తట్టారట సినిమా నిర్మాతలు. ఇంత మంచి అవకాశం సామ్ వదులుకుంటుందా!
Samantha: చైతన్యతో విడిపోయిన తరువాత ఇలా అవుతుంది అనుకోలేదు .. ముందే తెలిసిఉంటే : సమంత
మారి పూరి సినిమా సంగతి?
ఇకపోతే విజయ్ పూరి సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న మాట తెలిసినదే. దీని తరువాత విజయ్ పూరితో ప్లాన్ చేసిన జనగనమణ సినిమాకు లోకషన్ల ప్రాబ్లెమ్ ఉందట. అందుకని ఈ లోగా ఓ సినిమా చేసేయాలని విజయ్ డిసైడ్ అయ్యాడు. దాని కోసమే ఈ మధ్యలో శివానిర్వాణ ప్రాజెక్ట్ కోసం సామ్ ని అడిగారట. త్వరలో షూటింగ్ ప్రారంభించి ఫినిష్ చేసి, ఆపైన జఙనగనమణ సినిమా స్టార్ట్ చేస్తారట మన రౌడీ.