SBI: భారతీయ అతి పెద్ద బ్యాంకు SBI (స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అవును. మనలో చాలా మంది సేవ్ చేసుకున్న డబ్బుని వారి ఇరుగు పొరుగు వారికి వడ్డీకి ఇచ్చే బదులు బ్యాంకు కి ఇస్తే సేఫ్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే, మనకు తెలియనివి కావు. బయటి జరుగుతున్న నేరాలు.. ఘోరాలు. అందుకనే చాలామంది బ్యాంకులను ఆశ్రయిస్తారు. కానీ కష్టపడిన సొమ్ము తీరా బ్యాంకులలో వేస్తే అక్కడ వడ్డీ రేట్లు చాలా తక్కువన్న సంగతి కూడా తెలిసినదే. అందుకే కొంతమంది తమ డబ్బుని బ్యాంకులలో ఉంచడానికి మొగ్గు చూపరు.
SBI Bank: మీరు వ్యాపారులా? అయితే SBI ప్రకటన వెంటనే చూడండి!
SBI చెప్పిన శుభవార్త ఇదే..
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచింది. అవును.. ఇది ఖచ్చితంగా బ్యాంకులలో డబ్బు దాచుకోవాలి అనుకున్నవారికి శుభవార్తే. బేస్ రేట్‌ను 0.10% నుండి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. తాజాగా సవరించిన రేటు ప్రకారం ఈ డిసెంబర్ 15 నుంచి వార్షికంగా 7.55% వడ్డీ SBI ఇవ్వనుంది. ఈ ఏడాది మొదట్లో SBI బేస్ రేట్‌ను 0.5 శాతం మేర తగ్గించిన మాట మనలో చాలా మందికి తెలుసు. దాంతో వడ్డీరేట్లు 7.45 శాతానికి దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) కనీస వడ్డీరేటును నిర్ణయించడం జరిగింది.
SBI: భారత ఆర్మీతో ఓ ఒప్పందం చేసుకున్న SBI…
మరిన్ని వివరాలు:
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, కేంద్ర బ్యాంకు నిర్ణయించిన కనీస వడ్డీరేటు కన్నా తక్కువ వడ్డీరేటు అమలు చేసేందుకు మిగిలిన ఏ బ్యాంకులకైనా వీలు లేదు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, రూ.2 కోట్లకు తక్కువ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లో మాత్రం ఏ మార్పు చేయలేదు. కాబట్టి ఇది కేవలం అధిక మొత్తంలో సేవ్ చేసిన వారికే బెనిఫిట్ కాబోతుంది. ఈ విషయాన్ని కస్టమర్లు గమనించగలరు. మరిన్ని వివరాలకు SBI వ్యక్తిగత వెబ్ సిట్ ను సంప్రదించగలరు.