Tik tok: టిక్ టాక్ ప్రపంచాన్ని ఊపేస్తున్న యాప్. నిజం చెప్పాలంటూ ప్రతి ఒక్కరి ట్యాలెంట్ ను ప్రదర్శించేందుకు అందరికీ అందుబాటులోకి వచ్చిన ఓ వేదిక. చాలా సింపుల్ గానే చాలామంది దీని కారణంగా స్టార్లు అయిపోయారు. చాలామందికి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయంటే దీని ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతలా ప్రభావం చూపింది టిక్ టాక్ యాప్. మన దేశంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే తక్కువ సమయంలోనే కోట్లాదిమంది దీన్ని ఇన్ స్టాల్ చేసుకున్నారు.
Kartikeya: కార్తికేయ ఇక వాటికి ఫిక్సవ్వాల్సిందేనా..అంతకంటే చేయగలిగిందేమీ లేదా..?
రాత్రి 7గంటల వరకే..
అయితే మన దేశంలో టిక్‌టాక్ ను బ్యాన్ చేసిన తర్వాత దీని ప్రభావం మన దేశంలో లేకపోయినా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. అలాంటి టిక్ టాక్ (TIK tok)తన ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించేసింది. టిక్ టాక్‌కు మాతృ సంస్థ అయినటువటి బైట్‌డ్యాన్స్ లిమిటెడ్ తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఎవరూ కూడా రాత్రి 7 గంటలు దాటితో ఎవరూ పనిచేయాల్సిన అవసరం లేదని తెలిపింది. 7 గంటల దాకానే షిఫ్టులు క్లోజ్ అవుతాయని ఆ కంపెనీ తెలపింది. ఇక వారంలో కూడా సోమవారం నుంచి శుక్రవారం దాకానే పనిచేయాలంది.
టిక్ టిక్ నయా ప్లాన్స్.. వర్కౌటయితే పూర్వ వైభవమే!
12 గంటలు పనిచేయడం ఇబ్బంది..
శని, ఆది వారాల్లో పూర్తిగా సెలవులు ప్రకటించేసింది. పైగా పని దినాల్లో మాత్రం రాత్రి 7 గంటలు దాటితే పనిచేయడాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ వేళలో పనిచేయాల్సిన అవసరం వస్తే గనక తప్పకుండా కంపెనీ పర్మిషన్ తీసుకోవాలంటూ తెలిపింది. కేవలం తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమార్థం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.
ఇప్పటి వరకు ప్రపంచంలో తాము మాత్రమే ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు బైట్ డ్యాన్స్ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు అంటే 12 గంటలు పనిచేయడం చాలా ఇబ్బంది అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.