NewsOrbit
జాతీయం న్యూస్

Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్ చెప్పిన ఒక మంచి వార్త ..మరో చెడు వార్త !అవేమిటంటే ..?

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సామాన్యుడికి ఒక మంచి వార్త …ఒక చెడు వార్తా ఉన్నాయి.

Good news told by Nirmala Sitharaman..another bad news!
Good news told by Nirmala Sitharaman..another bad news!

ఇకపై అన్ని ప్రాంతాల్లో వన్ నేషన్-వన్ రేషన్ అమలు కాబోతుండడం మంచి వార్త అయితే ..పెట్రోల్ డీజిల్పై సుంకం శాతం పెంచడం అనేది చెడు వార్త.వివరాల్లోకి వెళితే …
బడ్జెట్ లో రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వన్ నేషన్-వన్ రేషన్ విధానం ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో పూర్తి స్తాయిలో అమలు చేయనున్నారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌ తీసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ రేషన్ విధానం విజయవంతంగా అమలవుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

Nirmala Sitharaman :పెట్రో వాత పెట్టిన కేంద్రం!

బడ్జెట్ లో కామన్ మ్యాన్(సామాన్యుడికి) ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్రం.. భారీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. కామన్ మ్యాన్ కి పెట్రో వాత పెట్టింది. పెట్రోల్, డీజిల్ పై వ్యవసాయ సెస్(సుంకం) విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. లీటర్ పెట్రోల్ పై రూ.2.50, డీజిల్ పై రూ.4 వ్యవసాయ సెస్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఈ కారణంగా ఇప్పటికే సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు మరింత పెరగనున్నాయి.డీజిల్, పెట్రోల్ ట్యాక్సుల విషయంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం విధించారు. ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు వాటా, సెస్సు మొత్తం కేంద్రం ఖజనాకే చేరనుంది. మార్పులు చేర్పులతో రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి పడనుంది. కాగా, అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ తో లీటర్‌ పెట్రోలు ధర సెంచరీ దాటడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100కు చేరిన సంగతి తెలిసిందే.

ట్యాక్స్ పేయర్స్ కు నిరాశే!

ఇక ఎంతో కాలంగా ఆదాయపు పన్ను శ్లాబ్ మారుస్తారన్న ఆశతో ఉన్న ట్యాక్స్ పేయర్స్ కి కూడా కేంద్రం మొండి చేయి చూపింది.నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆదాయపన్ను స్లాబ్ లకి సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.ఫలితంగా ఇప్పుడున్న శ్లాబులే కొనసాగబోతున్నాయని స్పష్టమవుతోంది.ఇది ఉద్యోగవర్గాలకు తీవ్ర నిరాశ కలిగించింది.

 

author avatar
Yandamuri

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju