NewsOrbit
న్యూస్

Gruhapravesam: గృహ ప్రవేశం ఈ తిథులు ,ఈ వారాల లో   చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి!!

Share

Gruhapravesam:  గృహ ప్రవేశం
ఇంటి  నిర్మాణం పూర్తి అయిన  తర్వాత గృహ ప్రవేశం (Gruhapravesam )కోసం  మంచి ముహూర్తం    చూసుకుంటారు.  కొత్తగా కట్టుకున్న  గృహంలోకి ఎప్పుడువెళ్తే  మంచిది అనే అంశం లో  వాస్తుశాస్త్రం  ఇచ్చిన సూచనలు ఏమిటో తెలుసుకుందాం.  అదేమిటంటే  సూర్య భగవానుడు  కుంభరాశిలో తిరిగే  కాలం తీసేస్తే  మిగిలిన నెలలు అన్ని  శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం  ( Architecture ) తెలియచేస్తుంది.   కార్తీక, మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం వివరిస్తుంది.  నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం బహు  మంచి కాలమని వాస్తుశాస్త్రం

తెలియచేస్తుంది.

Gruhapravesam:  దక్షిణం వైపు  సింహద్వారము

అయితే   రిక్త తిథులైన చవితి రోజు , నవమి రోజు , చతుర్థీ తిథులు వదిలి  మిగిలిన తిథులలోపౌర్ణమి , సప్తమి రోజు , అష్టమి రోజు , దశమి తిథులు శుక్ల పక్ష  ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు విదియ, తదియలు యోగ్యవంతమైనవిగా  వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.  అదే విధం గా  దక్షిణం వైపు  సింహద్వారము కలిగిన  ఇంటికి     గృహ ప్రవేశం  చేయడానికి    పాడ్యమి తిథి , షష్టి తిథి, ఏకాదశీ తిథి  అనుకూలమైనవి గా   చెబుతారు . ఉత్తరాయణంలో చూసుకుంటే మాఘమాసం లో , ఫాల్గుణం లో , వైశాఖం లు    మంచివిగా చెప్పబడినవి. మిగతా నెలల లో  నూతన గృహ ప్రవేశం  చేయకపోవడం  మంచిది అని  వాస్తు  తెలియచేసే మాట .

పూర్ణ తిధులైనటువంటి

తూర్పు సింహద్వారం గా ఉన్న ఉన్న గృహానికి  గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైనటువంటి  పంచమితిథి , దశమి తిథి , పౌర్ణమి  తిథులు మంచివి.  పడమర  సింహద్వారం  కలిగిన  ఇంటికి  విదియ  తో పాటు  , సప్తమి  రోజు  , ద్వాదశీ తిథులు అనుకూలమైనవి అని    శాస్త్రం  సూచిస్తుంది.  అలాగే సోమ వారం , బుధ వారం, గురువారం, శుక్రవారాలు శుభప్రదమని   ఆదివారం, మంగళ వారాలలో గృహ ప్రవేశం చేయడం అశుభప్రదం అని చెప్పబడింది.


Share

Related posts

Pushpa : పుష్ప సినిమాలో అనసూయ .. ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో క్లారిటీ వచ్చేసింది..?

GRK

ఎంపిలో ఘోర రోడ్డు ప్రమాదం: 15మంది మృతి

somaraju sharma

ఆత్మహత్యలు చూసైనా మేల్కొనాలి

somaraju sharma