NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

‘కరోనా’తోనూ మేలు..! అది ఏమిటంటే..?

చైనాలో పురుడు పోసుకున్న కరోనా (కోవిడ్ -19) మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించింది. దీనితో పెద్దలతో పాటు పిల్లలకు, నిరక్షరాస్యులకు కరోనా అంటే తెలిసి పోయింది. కరోనా మూలంగా అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పటికీ ప్రజానీకానికి తెలియకుండా కరోనా మేలు కూడా చేసింది.

Good with Corona too What is it

కరోనా అంటే ప్రతి ఒక్కరికీ ఒక భయం ఏర్పడింది. కరోనా కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించడంతో దాదాపుగా అన్ని దేశాలలో 70 నుండి 80 శాతం పాటిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రజలు భయంతో జాగ్రత్తలు పాటించడం వల్ల సీజనల్ గా వచ్చే ఇన్ ఫ్ల్యూయెంజా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈ విషయాన్ని వైద్య నిపుణులు ద్రువీకరిస్తున్నారు.

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఇన్ ఫ్ల్యూయెంజా కేసులు గణనీయంగా తగ్గాయని కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలు వెల్లడించాయి. దక్షిణ కొరియాలోనూ గత ఏడాదితో పోలిస్తే 83 శాతం మేర అంటువ్యాధులు తగ్గినట్లు సమాచారం. భారత దేశంలోనూ వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు తక్కువగా నమోదు అవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్ రాలేదు. మందులు రాలేదు. అయినప్పటికి సాధారణ వైద్యంతోనే కరోనాను జయిస్తున్నారు. చాలా మందికి ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా వస్తుంది, వారికి తెలియకుండానే వెళ్ళిపోతుంది. నేటి వరకు ఇండియాలో 18,55,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చాలా తక్కువ శాతం అంటే 38,938 మంది మాత్రమే మృతి చెందారు. 12,30,509 మంది కరోనా నుండి రికవరీ అవ్వగా 5,86,298 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!