Goodachari 2 : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆల్ రౌండర్స్ లో అడవి శేష్ ఒకరు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవి తర్వాత బ్లాక్ బస్టర్ సాధించిన గూఢచారి సీక్వెల్ మూవీలో నటించనున్నారు. వాస్తవంగా గూఢచారి 2 మేజర్ కంటే ముందే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కాలేదు. దానికి తాజాగా ఈ యంగ్ హీరో క్లారిటీ ఇచ్చాడు. ‘గూఢచారి 2’ మూవీని ముందున ప్రారంభించాలని అనుకున్నాను. అయితే ఇంతలోనే మేజర్ తో పాటు హిట్ సీక్వెల్ లో అవకాశాలొచ్చాయి. వీటిలో ముందు మేజర్ మూవీని మొదలు పెట్టాల్సి వచ్చింది.
అంతేకాదు ఈ మూవీ ఓ పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. మేజర్ షూటింగ్ కంప్లీట్ కాగానే హిట్ 2, ఆ తర్వాత గూఢచారి 2ని మొదలు పెట్టాలి. కానీ మేజర్ స్టార్ట్ అయ్యాక కరోనా మహమ్మారీ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనివల్ల నా ప్రాజెక్ట్ లన్నీ డిలే అయ్యాయి. మేజర్ టాకీ పార్ట్ పూర్తవ్వగానే హిట్ 2తో సెట్స్ మీదకి వెళ్ళాలి. అలాగే గూఢచారి 2 స్క్రిప్టు పనులను మొదలుపెట్టాలని అడవి శేష్ తెలిపాడు. ఇక అమీతుమీ లాంటి కామెడీ సినిమాలతో పాటు అమితాబ్ బచ్చన్ నటించిన షోలే వంటి సినిమాలలో నటించాలనుంది. ‘అందాజ్ ఆప్నా ఆప్నా’ వంటి ప్రేమకథలను ఎక్కువగా ఇష్టపడతానని తెలిపాడు.
Goodachari 2 : ‘మేజర్’ మూవీ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందుతోంది.
కాగా ఇప్పుడు అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ మూవీ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆయన ధైర్యం, త్యాగాన్ని ఎంతో ఉధ్వేగభరితంగా వెండితెరపై చూపించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్, తెలుగమ్మాయి శోభితా ధూలిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గూఢచారి సినిమా దర్శకుడు శశికిరణ్ తిక్కా ఈ చిత్రాన్నీ తెరకెక్కిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా – మహేష్ బాబు నిర్మాణ సంస్థ
జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ – ఆకాశ్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.