Bigg Boss 5 Telugu: ఐదో సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చేసిన గూగుల్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలు ముగియడంతో మూడవ వారం చివరి దశలో ఉండటంతో 19 మంది కంటెస్టెంట్ లు… ఎంట్రీ ఇవ్వగా 17 మంది మిగిలారు. ఈవారం ఐదుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు ఆదివారం..ఒకరు ఎలిమినేట్ కానున్నారు. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో.. ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యులు ఎవరికి వారు.. భారీగా పోటీ పడుతూ ఉన్నారు. బిగ్ బాస్ చిన్న టాస్క్ ఇచ్చిన గాని.. ఇంటిలో ఉన్న సభ్యులు నువ్వానేనా అన్నట్టుగా.. కసి తో ఆడుతున్నారు. చాలావరకు గేమ్ పై ఫోకస్ పెడుతూ.. ఫ్రెండ్షిప్ లను పక్కన పెడుతున్నారు. ఎలాగైనా టైటిల్ గెలవాలి అన్న తరహాలో కసితో గేమ్ ఆడుతున్నారు. హౌస్ లో సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటు ఇండస్ట్రీలో పేరుగాంచిన వాళ్లు… టాప్ యాంకర్ లు ఉండటంతో.. హౌస్ లో వాతావరణం రసవత్తరంగా ఉంది.

bigg boss telugu 5: 'బిగ్‌బాస్‌ సీజన్‌-5': హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీరే! - here bigg boss 5 telugu contestants list with photos

ఇక మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు… ఏ విధంగా ఉంటాయో.. అంటూ ఇప్పటినుండే బిగ్ బాస్ ఆడియన్స్… తెగ అంచనాలు పెట్టుకొని ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ విన్నర్ … ఎవరు అన్న దాని గురించి బయట రకరకాల చర్చలు జరుగుతూ ఉండటంతో గూగుల్ మాత్రం.. అప్పుడే ప్రకటించేసింది. షో మొదలై కేవలం రెండు వారాలే అవుతున్నప్పటికీ సింగర్‌ శ్రీరామచంద్ర విన్నర్‌ అని డిక్లేర్‌ చేసింది. ఇది బుల్లితెర ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తోంది. శ్రీరామ్‌ అభిమానులు మాత్రం గూగుల్‌ ఈ విషయాన్ని ముందే పసిగట్టేసింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మేటర్ లోకి వెళ్తే గూగుల్ లో… సీజన్ ఫైవ్ తెలుగు బిగ్ బాస్ ఎవరు అని నెటిజన్లు మరియు బిగ్బాస్ వీక్షకులు సర్ చేస్తూ ఉండగా అప్పుడే శ్రీ రామచంద్ర పేరు ప్రకటించేస్తుంది.

సినిమా ఇండస్ట్రీ లో ప్లే బ్యాక్ సింగర్ తో పాటు యాక్టర్ గా తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న శ్రీ రామచంద్ర ఇండియన్ ఐడల్ సీజన్ ఫైవ్ టైటిల్ కూడా అతడు కైవసం చేసుకోవడంతో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని గూగుల్ ఈ విధంగా వివరాలను చూపిస్తున్నట్లు తాజా వార్త పై.. కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క గూగుల్ లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ .. అని కొన్నిసార్లు టైప్ చేస్తుండగా ప్రియాంక సింగ్ పేరు కూడా వస్తుంది. దీంతో హౌస్ లో కంటెస్టెంట్ లకు సంబంధించి.. మద్దతుదారులు తాజా గూగుల్ వార్తలపై రకరకాల సెటైర్లు వేసుకుంటున్నారు. శ్రీరామచంద్ర హౌస్లో.. ఎవరి ట్రాప్లో పడకుండా తనకంటూ.. ఉన్న మైండ్ సెట్ తో మాస్క్ లేని గేమ్ ఆడుతూ.. వస్తున్నాడు.

 

ఇంటి సభ్యులతో ప్రతి ఒక్కరితో చక్కగా వెలుగుతూనే మరోపక్క తనని నెగిటివ్ చేయాలనుకున్న వారికి.. కన్నింగ్ మైండ్ తో తన దగ్గరికి వచ్చే వారికి తనదైన శైలిలో.. శ్రీ రామ్ చంద్ర కౌంటర్ వేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక తాను సీజన్ ఫైవ్ లో.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి గల కారణం డబ్బులు గెలుచుకోవటానికి కాదు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకో టానికి అని… శ్రీ రామచంద్ర చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా హౌస్ లో టఫ్ కాంపిటీషన్.. శ్రీ రామచంద్ర మిగతా ఇంటి సభ్యులకు ఇస్తున్నట్లు ఓటింగ్ లో కూడా అదే తేలినట్లు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నాయి. మరోపక్క శ్రీరామచంద్ర టైటిల్ విన్నర్ గెలిస్తే సీజన్ త్రీ టైటిల్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందని.. తాజా వార్త పై మరికొంతమంది స్పందిస్తున్నారు.


Share

Related posts

Thinking: వీటి గురించి  ఎప్పుడైనా ఆలోచించారా ?? ఆలోచించండి మంచి ఎనర్జీ వస్తుంది!!

siddhu

కరోనా పై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Siva Prasad

బ్రేకింగ్: వెలగపూడి గోపాలకృష్ణ.. నిన్న చెప్పుతో కొట్టుకున్నారు.. ఈరోజు సస్పెండ్ అయ్యారు

Vihari