గూగుల్ ఈ రోజు (శనివారం) తన డూడల్ హ్యాండిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందిన ‘బబుల్ టీ’ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. 17వ శతాబ్దం నుంచి తైవాన్‌లో బబుల్ టీ అందరికీ అందుబాటులోనే ఉంది. కరోనా సమయంలోనే దీనికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. 2020 జనవరి 29న బబుల్ టీని ఎమోజీతో యానిమేటెడ్ వీడియోను లాంఛ్ చేశారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా బబుల్ టీకి గుర్తింపు వచ్చింది. ఈ బబుల్ టీలో పాలతోపాటు టాంగీ, ఫ్రూట్స్, బొబా బాల్స్, ఇతర ఇంగ్రీడియన్స్ కలుపుతారు. రుచితోపాటు శరీర సామర్థ్యాన్ని, శక్తిని పెంచుతుంది. కరోనా సమయంలో బబుల్ టీని క్రేజ్ విపరీతంగా పెరిగింది. అప్పటి నుంచి ఈ టీని తాగేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

డూడల్‌పై బబుల్ టీ
బబుల్ టీని బోబా టీ, పెర్ల్ మిల్క్ టీ అని కూడా పిలుస్తుంటారు. రుచితో సంబంధం లేకుండా అన్ని రకాల ఇంగ్రీడియన్స్ కలిపి తయారు చేస్తుంటారు. ఇప్పటికీ తైవాన్‌లోని ప్రాంతాల్లో కొత్త కొత్త రుచులతో బబుల్ టీని తయారు చేస్తుంటారు. ఈ టీ ఆసియా ఖండం మొత్తం వ్యాపించింది. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఇలా చాలా వరకు దేశాల్లో బబుల్ టీకి ఆదరణ లభించింది. అయితే నేడు బబుల్ టీ యానిమేషన్‌ను లాంఛ్ చేసి రోజే. ఈ క్రమంలో గూగుల్ కూడా బబుల్ టీని వేడుకగా జరుపుకుంటోంది. ఈ రోజు తన డూడల్‌పై బబుల్ టీ తయారీ విధానాన్ని యానియేటెడ్‌గా ప్రదర్శిస్తోంది. ఈ యానిమేటెడ్ డ్యూడల్‌లో తైవాన్ దేశీయ ఫార్మోసాన్ మౌంటైన్ డాగ్ కనిపిస్తుంది. ఆ డాన్ బబుల్ టీని తయారు చేయడం మనం గమనించవచ్చు.
గూగుల్ ప్రతి రోజు డూడల్ హ్యాండిల్‌ను ఛేంజ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మనుషులు, ప్రత్యేకమైన తేదీలు, ప్రత్యేక చరిత్ర కలిగిన రోజును తీసుకుని దానితో డూడల్ హ్యాండిన్‌లో గూగుల్ ఆ వేడుకను జరుపుకుంటుంది. డూడల్ కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న గూగుల్.. దాని సాయంతో ఇలాంటి డూడల్‌ను క్రియేట్ చేసి నెటిజన్ల ముందుకు తీసుకొస్తుంది.
డూడల్ అంటే ఏమిటి?
డూడల్ అనేది ప్రత్యేకమైన ఈవెంట్స్, సెలవులు, విజయాలు, ప్రముఖ వ్యక్తులను స్మరించుకోవడానికి గూగుల్ తన హోమ్ పేజీలోని లోగోలో చేసే తాత్కాలిక మార్పు. మొదట్లో గూగుల్ తన డూడల్‌ను ఒకే ఫార్మాట్‌లో ధీర్ఘకాలికంగా కొనసాగించింది. ఆ తర్వాత లారీ పేజ్, సెర్గీ బ్రిన్ నాయకత్వంలో డూడల్‌ను తీసుకొచ్చారు. మొదట్లో గ్రహాంతవాసుల ల్యాండింగ్, ప్రధాన సెలవులు, తమకు అనుకూలంగా అనిపించే లోగోలతో డూడల్‌లు తయారు చేసే వారు. 2010 నుంచి డూడల్ ఫ్రీక్వెన్సీలు పెరిగాయి. యానిమేటెడ్ డిజైనింగ్‌తో డిఫరెంట్‌గా డూడల్‌ను తయారు చేస్తూ.. గూగుల్ ఆదరణ పొందుతోంది.