మనీ ట్రాన్సాక్షన్ యాప్ అంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది గూగుల్ పే యాప్.. దేశంలో ఈ యూప్ ను చాలా మంది విచ్చల విడిగా ఉపయోగించేస్తుంటారు. కాని ప్రస్తుతం యాపిల్ ఇండియన్ యూజర్లకు మాత్రం ఈ యాప్ అందుబాటులో లేనట్లే. యాప్ స్టోర్ లో గూగుల్ పేని అని సెర్చ్ చేసినా అందులో కేవలం ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ లు కనిపిస్తాయి తప్ప గూగుల్ పే మాత్రం కనిపించదు.
అగస్టు నెలలో యూజర్లకు ఈ యాప్ మూలంగా ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ యాప్ ను తొలగించారు. దీనిపై గూగుల్ అధికార ప్రతినిధి కూడా స్పందించారు.. గూగుల్ పేను యాపిల్ యాప్ ను యాప్ స్టోర్ నుంచి తొలగించామన్నారు. అగస్టులో ఈ యాప్ చాలా ఇబ్బందులు పెట్టింది. దీనిపై చాలా మంది ఇష్యూ కూడా చేశారు.. అయినప్పటికీ కొన్ని గంటల్లోనే సమస్యను చక్కదిద్దాము.. కాని మళ్లీ సమస్య రావడంతో ఈ యాప్ ను యాప్ స్టోర్ నుంచి తొలగించామని తలిపారు.
ఈ సమస్య నుంచి బయటపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కాగా యాపిల్ ఫోన్ ను వాడేవారిలో కొంతమందికి పేమెంట్ విషయంలో సమస్యలు ఎదురైయ్యాయని కొందరు వాపోయారు. దీంతో ఈ సమస్యను వీలైనంత వరకు పరిష్కరిస్తామని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. పేమెంట్ ఫెయిల్ అయిన యూజర్లు హెల్ప్ కోసం గూగుల్ పే సపోర్ట్ ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
అలాగే వీలైనంత త్వరతగితని ఈ గూగుల్ పే యప్ ను యాప్ స్టోర్ లో ఉండేలా చేస్తామని తెలిపారు. మరికొన్ని రోజుల వరకు యాపిల్ యూజర్లు ఈ గూగుల్ పే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. ఒక వేల మీరు యాప్ స్టోర్ లో సెర్చ్ చేసినా అది కనిపించదని ఆయన తెలిపారు.