Google Good News: అందరు విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు చదివేది ఉద్యోగం కోసమే. మంచి ఉద్యోగం సంపాధించి జీవితంలో సెటిల్ కావాలని అందరూ కలలు కంటూ ఉంటారు. అటువంటి అవకాశం కోసమే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు.
గూగుల్ సువర్ణావకాశం..
మంచి భవిష్యత్ కొరకు వెయిట్ చేస్తున్న విద్యార్థులకు టెక్ దిగ్గజం గూగుల్ శుభవార్తను చెప్పింది. కంప్యూటర్ సైన్స్(computer science) చదివే అమ్మాయిలకు అదిరిపోయే రీతిలో స్కాలర్ షిప్(scholarship) అందించనున్నట్లు ప్రకటించింది. కంప్యూటర్ సైన్స్ లో అద్భుతాలు చేయాలని భావించే విద్యార్థినులకు ఈ అవకాశం ఉపయోగపడనుంది. గూగుల్ కంపెనీ జనరేషన్ గూగుల్ స్కాలర్ షిప్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత సంవత్సరం నుంచే విద్యార్థినులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది.
1000 డాలర్లు మీ సొంతం
కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చదివే అమ్మాయిల కోసం గూగుల్ కంపెనీ ఈ స్కాలర్ షిప్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్ షిప్ కు సెలెక్ట్ అయిన విద్యార్థినులకు 2022–2023వ విద్యాసంవత్సరానికి గాను సుమారు 1000 డాలర్లు అంటే మన రూపాయలలో దాదాపు అక్షరాలా 74 వేల రూపాయలను గూగుల్ అందించనుంది. స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 10 వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థినుల గత అకాడమిక్ రికార్డులను కూడా గూగుల్ పరిశీలించనుంది. మంచి అకడమిక్ రికార్డును కలిగిన విద్యార్థునులకు గూగుల్ ఈ అరుదైన అవకాశాన్ని అందిచనుంది.
2021–2022 వ విద్యా సంవత్సరంలో స్కాలర్ షిప్ పొందాలనుకున్న వారు బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తూ ఉండాలి. స్కాలర్ షిప్ ప్రోగ్రాం పూర్తయ్యే నాటికి ఆసియా పసిఫిక్ దేశాల్లో గుర్తింపుపొందిన యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం అభ్యసిస్తూ ఉండాలి. స్కాలర్ షిప్ మొత్తాన్ని ట్యూషన్ ఫీజులు, పుస్తకాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు స్కాలర్ షిప్ పొందేందుకు రెండు 400 పదాల వ్యాసాలను సమర్పించవలసి ఉంటుంది. ఈ రెండు వ్యాసాలు కూడా ఇంగ్లిష్ లోనే ఉండాలి.