Gopichand : గోపీచంద్ Gopichand పక్కా కమర్షియల్ సినిమా ప్రారంభం అయింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తయారవబోతోంది. గత కొంతకాలంగా యాక్షన్ హీరో గోపీచంద్ కి సరైన హిట్ లేక రేస్ లో బాగా వెనకబడ్డాడు. దాంతో భారీ హిట్ అందుకొని మళ్ళీ ఫాంలోకి వచ్చి తన సత్తా చాటాలనుకుంటున్నాడు. గత చిత్రం గౌతం నంద భారీ డిజాస్టర్ గా నిలవడంతో సంపత్ నంది ఈ సారి గోపీచంద్ కి ఖచ్చితంగా హిట్ ఇవ్వాలని కసిగా ఉన్నాడు.
ఈ క్రమంలో గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో సీటీమార్ తెరకెక్కింది. తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. తమన్నా – గోపీచంద్ కబడ్డీ కోచ్‌లుగా కనిపించబోతున్నారు. కబడ్డీ ఆట నేపథ్యం తో పాటు రాజకీయ అంశాలు కలిసి చూపించబోతున్నాడట దర్శకుడు సంపత్ నంది. ఇక మెలోడిబ్రహ్మ మణిశర్మ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలవనుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు అప్సరరాణి స్పెషల్ సాంగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Gopichand : గోపీచంద్ ని లాయర్ గా చూపించబోతున్నడట దర్శకుడు మారుతి.
కాగా తాజాగా మారుతి – గోపీచంద్ ల పక్కా కమర్షియల్ సినిమా ప్రారంభం అయింది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మారుతి గత చిత్రం ప్రతీరోజూ పండుగే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో పక్కా కమర్షియల్ సినిమా మీద బాగానే అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ని లాయర్ గా చూపించబోతున్నడట దర్శకుడు మారుతి.