రవితేజ క్రాక్ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని పరిస్థితేంటి ..?

రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరిది హిట్ కాంబినేషన్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. డాన్ శీను సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయిన gopichand malineni మొదటి సినిమాతోనే సాలీడ్ హిట్ అందుకున్నాడు. రవితేజకి మంచి హిట్ ఇచ్చాడు. ఆ రోజు రవితేజ దర్శకుడిగా గోపీచంద్ మలినేని కి అవకాశం ఇచ్చి లైఫ్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత gopichand malineni ‘బాడీగార్డ్’, ‘బలుపు’, ‘పండగ చేస్కో’, ‘విన్నర్’ సినిమాలు తెరకెక్కించాడు. అయితే రవితేజ సినిమాలే గోపీచంద్ మలినేనికి హిట్స్ ఇచ్చాయి. విన్నర్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనికి మళ్ళీ సినిమా చేసే అవకాశం రాలేదు.

 

దాదాపు మూడేళ్ళ తర్వాత ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ధైర్యం చేసి ఫ్లాపుల్లో ఇంకా చెప్పాలంటే అవకాశాలు లేని దర్శకుడి మీద నమ్మకం పెట్టుకొని క్రాక్ సినిమా అవకాశం ఇచ్చాడు. అంతేకాదు gopichand malineni కి మళ్ళీ లైఫ్ ఇచ్చాడు. గోపీచంద్ మలినేని కూడా ప్రామిస్ చేసినట్టుగా రవితేజ కి హిట్ ఇచ్చి సక్సస్ ట్రాక్ ఎక్కించాడు. నిజంగా క్రాక్ సినిమా విషయంలో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం గొప్ప విషయం. అయితే ఈ సినిమా సక్సస్ తో gopichand malineni కి స్టార్ హీరోల దగ్గర్నుంచి పిలుపొస్తుందని అందరు భావించారు.

 

కాని ఇప్పటి వరకు gopichand malineni కి ఇంకా అలాంటి కాల్ ఏదీ రాలేదని సమాచారం. అయితే ఎనర్జిటిక్ హీరో రాం.. బాలకృష్ణ .. వెంకటేష్ లలో ఒకరితో గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమా ఉంటుందని ప్రచారం అవుతోంది. అంతేకాదు క్రాక్ సినిమా మెగా పవర్ స్టార్ రాం చరణ్ ని కూడా బాగా ఆకట్టుకుంది. చరణ్ కూడా గోపీచంద్ మలినేని కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రాం చరణ్ కూడా గోపీచంద్ మలినేని మీద ఆసక్తిగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి gopichand malineni కి కాల్ ఏ హీరో నుంచి వస్తుందో.