Gopichand malineni: గోపీచంద్ మలినేని..మూడేళ్ళ తర్వాత రవితేజకు భారీ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు రవితేజ సూపర్ ఫాంలోకి వచ్చి వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడంటే దానికి కారణం మూడేళ్ళ తర్వాత వచ్చిన క్రాక్ సినిమానే కారణం. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన పక్కా మాస్ ఎంటర్టైనర్ క్రాక్. ఈ సినిమా దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి. హీరో..హీరో హీరోయిన్స్‌గా రవితేజ – శృతి హాసన్‌లకి మూడేళ్ళ తర్వాత దక్కిన సక్సెస్. ఈ సినిమా చూసిన ఏ హీరో అయినా దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా ఇవ్వాల్సిందే.
అంత హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా క్రాక్ సినిమాను ప్రజెంట్ చేశాడు. ఇలాంటి కథలు నట సింహం నందమూరి బాలకృష్ణకు పర్ఫెక్ట్గా సూటవుతాయి. ముఖ్యంగా క్రాక్ సినిమాలో ఉన్న రవితేజ డైలాగ్స్ చాలావరకు బాలయ్య చెప్పే స్టైల్లోనే ఉంటాయి. కథ, కథనం కూడా బాలయ్యకు సెట్ అయ్యే విధంగానే ఉంటుంది. ఇదే బాలయ్యను బాగా ఇంప్రెస్ చేసింది. గతంలో బాలయ్య పోలీస్ పాత్రలో నటించిన లక్ష్మీ నరసింహ కూడా ఇంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. హీరోయిజం రెండు సినిమాలలో దాదాపు ఒకే మాదిరిగా ఉంటుంది.
Gopichand malineni: గోపీచంద్ మలినేని చెప్పిన కథ బి గోపాల్ మాదిరిగా ఉండబోతోదట.
ఇవన్నీ కలిసి బాలయ్య గోపీచంద్ మలినేనికి అవకాశం ఇచ్చేలా చేశాయి. ఇక బాలయ్య కోసం గోపీచంద్ మలినేని తయారు చేసిన కథ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందట. బాలయ్యకు ఇలాంటి సినిమాలు కొట్టిన పిండి. ఈ మధ్యకాలంలో సరైన ఫ్యాక్షన్ సినిమా బాలయ్యకు పడలేదు. ఇప్పుడు రాబోతున్న అఖండ మళ్ళీ అదే తరహా సినిమా అని బాలయ్య క్యారెక్టర్ చూస్తే అర్థమవుతోంది. అయితే, గోపీచంద్ మలినేని చెప్పిన కథ ..ఆయన తీయబోయే విధానం అంతా కూడా సీనియర్ దర్శకుడు బి గోపాల్ మాదిరిగా ఉండబోతోదట. అందుకే మేయిన్ కథా నేపథ్యం ఏంటో తెలుసుకున్న బాలయ్య వెంటనే క్రాక్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది.