న్యూస్ సినిమా

గోపీచంద్ నిజంగానే రాశీఖన్నాని రిజెక్ట్ చేశాడా ..?

Share

గోపీచంద్ రాశీఖన్నా తో కలిసి ఇప్పటికే రెండు సినిమాలు నటించారు. జిల్ అన్న సినిమాతో పాటు ఆక్సిజన్ సినిమాలో గోపీచంద్ .. రాశీఖన్నా తో రొమాన్స్ చేశాడు. ఈ రెండు సినిమాలలో జిల్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాని ఆక్సిజన్ మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. కాగా ప్రస్తుతం gopichand తమన్న కలిసి సీటీమార్ అన్న సినిమా చేస్తున్నారు. సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో gopichand, తమన్నా కోచ్ లుగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత gopichand .. మారుతి దర్శకత్వంలో నటించబోతునట్టు రీసెంట్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ లో కాస్టింగ్ సెలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు maruthi గోపీచంద్ కి జంటగా బబ్లీ బ్యూటి రాశిఖన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని భావించాడట మారుతీ. maruthi గత చిత్రం ప్రతీరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అందుకే ఈ సినిమాలో కూడా rasikhanna ని తీసుకోవాలని ప్రపోజల్ పెట్టాడట. కానీ హీరో గోపీచంద్ ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నాని తీసుకునేందుకు ఒప్పుకోలేదని సమాచారం.

అందుకు కారణం ప్రస్తుతం rasikhanna ఫాం లో లేకపోవడమే అన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రాశీఖన్నా నటించిన సినిమాలలో వెంకీమామ, ప్రతీరోజూ పండుగే తప్ప మిగతా సినిమాలన్ని ఫ్లాప్ గా మిగిలాయి. gopichand కెరీర్ కూడా అంత ఆసక్తిగా సాగడం లేదు. అందుకే గోపీచంద్ ఈ ప్రాజెక్ట్ లో రాశీఖన్నా ని తీసుకోవాలనుకుంటే రిజెక్ట్ చేశాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేనప్పటికి ప్రస్తుతం రాశీఖన్నా కి తమిళంలో మాత్రం మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి.


Share

Related posts

బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పిన ఎన్ టి ఆర్ .. ఒకే వేదిక మీదకి రాబోతున్న బాబాయ్ అబ్బాయ్..!

GRK

బిగ్ బాస్ 4: మరోసారి ఏవర్ గ్రీన్ మన్మధుడు అనిపించుకున్న నాగార్జున…!!

sekhar

YV Subbareddy: బాబాయ్ నీ టెన్షన్ పెట్టేస్తున్న అబ్బాయ్!సుబ్బారెడ్డిని సూపర్ సిఎం ఏం చేయబోతున్నారు ?

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar