Gopichand – sampath nandi : కొన్ని కాంబినేషన్స్ కలిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటుంటారు. అలాంటి కాంబినేషన్స్ మెగాస్టార్ చిరంజీవి – ఎ కోదండ రామిరెడ్డిలది. వీరి కాంబినేషన్లో వచ్చిన 18 సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. చిరంజీవికి మాస్ హీరో ఇమేజ్ తెచ్చిన దర్శకులలో ముఖ్య పాత్ర పోషించిన దర్శకుడు ఎ కోదండ రామిరెడ్డి. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే బ్లైండ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అని ప్రతీ ఒక్కరు ఫిక్స్ అవాల్సిందే. నిర్మాతల మీద ఈ కాంబినేషన్ కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ వీరి కాంబినేషన్ లో సినిమా చేయమని చెప్పే ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నారు.
అలాంటి కాంబినేషన్ మళ్ళీ కామెడీ కింగ్ నట కిరీటి డా.రాజేంద్రప్రసాద్ – రేలంగి నరసింహా రావులది. వీరి కాంబినేషన్లో వచ్చిన 18 సినిమాలు కూడా వరుసగా భారీ హిట్స్ సాధించాయి. రాజేంద్రప్రసాద్ – రేలంగి సినిమా అంటే కూడా ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో మంచి అంచనాలు ఉండేవి. కామెడీ జోనర్లో వరుసగా 18 హిట్స్ ఇవ్వడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. కానీ ఈ కాంబినేషన్ అది నిరూపించింది. అలాంటి కొన్ని రేర్ కాంబినేషన్స్ ఇంకా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. పూరి జగన్నాథ్ మాస్ మహారాజ రవితేజలది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు వచ్చాయి.
Gopichand – sampath nandi : గోపీచంద్ కి భారీ హిట్ ఇవ్వాలనుకున్నాడు సంపత్ నంది.
ఈ కాంబినేషన్ మీద కూడా అందరిలో భారీ అంచనాలుంటాయి. ఎప్పుడెప్పుడు పూరి – రవితేజ కలిసి సినిమా చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి మరో కాంబినేషనే సంపత్ నంది – మాచో గోపీచంద్లది. అంతక ముందు వీరిద్దరి కాంబినేషన్ లో గౌతం నంద అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో ఎలాగైనా మళ్ళీ సినిమా చేసి గోపీచంద్ కి భారీ హిట్ ఇవ్వాలనుకున్నాడు సంపత్ నంది. అందుకే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథ సిద్దం చేసి చెప్పాడు. గోపీచంద్ కూడా ముందు ఇచ్చిన ఫ్లాప్ సినిమాను మైండ్ లో పెట్టుకోకుండా కథ నచ్చి గీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ మొదలైంది..పూర్తైంది.
Gopichand – sampath nandi : ఎవరికీ సంపత్ నంది – గోపీచంద్‌ల సీటీమార్ సినిమా మీద అంచనాలు లేవు.
కానీ రిలీజ్ చేయాలనుకునేసరికి కరోనా వేవ్స్ దెబ్బ కొట్టాయి. దాంతో అనుకున్న సమయానికి వీరి కాంబినేషన్లో రూపొందిన సీటీమార్ సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. వాయిదాల మీద వాయిదాలు వేసుకున్నారు. దాంతో ఎవరికీ సంపత్ నంది – గోపీచంద్‌ల సీటీమార్ సినిమా మీద అంచనాలు లేవు. కానీ వీరు మాత్రం ఒకరి మీద ఒకరు గట్టి నమ్మకం పెట్టుకున్నారు. వీరి నమ్మకానికి హీరోయిన్ తమన్నా, అలాగే నిర్మాత తోడయ్యారు. ఓటీటీలో రిలీజ్ అవుతుందని రూమర్స్ వచ్చినా పట్టించుకోలేదు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీటీమార్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. నిర్మాతకి మంచి లాభాలు దక్కుతాయని అందరూ చెప్పుకుంటున్నారు. మొత్తానికి సినిమా రిలీజ్‌కి ముందు కామెంట్ చేసిన వాళ్ళు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు సీటీమార్ సినిమాను, సంపత్ నంది – గోపీచంద్ కాంబినేషన్‌ను పొగుడుతున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!