Seetimaar Review: సీటీమార్ మూవీ రివ్యూ

Share

Seetimaar Review: గోపీచంద్, తమన్నాభాటియా జంటగా నటించిన ‘సీటీమార్’ చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంపత్ మంది తెరకెక్కించాడు. చిట్టూరి శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

A New Release Date For Gopichand's Seetimaar | Seetimaar News

 

కథ

కార్తీక్ సుబ్రహ్మణ్యం (గోపీచంద్) ఏపీ మహిళా కనపడతాడు. అయితే అమ్మాయిల కబడ్డీ ఆడేందుకు వారి కుటుంబాలు అంగీకరించకపోతే ఎలాగైనా వారిని బరిలో దింపాలని కార్తీక్ బాగా కష్టపడతాడు. ఇదే సమయంలో తెలంగాణ మహిళలకు కోచ్ జ్వాలా రెడ్డి (తమన్నా) తో ప్రేమలో పడతాడు కార్తీక్. ఇక నేషనల్ కబడ్డీ పోటీలకు ఈ రెండు జట్లు పాల్గొంటాయి. అయితే ఒక గ్యాంగ్ వీరిని బెదిరిస్తూ ఉంటారు. వీరితో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఆ జట్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అసలు కార్తీక్ ఫ్లాష్బ్యాక్ ఏమిటి? ఈ పోలీస్ ఆఫీసర్ వీరిని ఎందుకు అడ్డుకోవాలి అనుకుంటాడు? నేషనల్ కబడ్డీ పోటీల్లో కార్తీక్ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చారు మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్

కబడ్డీ కోచ్ గా గోపీచంద్ తనదైన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. సినిమా ఆద్యంతం అతను కనబరిచిన నటన ఎంతో బాగుంది.

మహిళలు అన్నింటిలో ముందడుగు వేయాలి అన్న కాన్సెప్ట్ ఇక్కడ బాగా వర్కౌట్ అయింది. ఇది పాత కాన్సెప్ట్ అయినా నేను కొత్తగా ఉద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అలాగే గోపిచంద్, తమన్నా మధ్య జరిగే లవ్ ట్రాక్ కూడా బాగా ఆకట్టుకుంటుంది.

గోపీచంద్ ట్రైనింగ్ ఇచ్చే సీన్లు గ్యాంగ్ వారిని అడ్డు పడుతుంటే గోపీచంద్ వారిని ఎదుర్కొనే సీన్లు కూడా చాలా బాగా వచ్చాయి.

పాటలు సినిమాకు పెద్ద ప్లస్. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది.

 

మైనస్ పాయింట్స్

కబడ్డీ కోచ్ గా గోపీచంద్ కి ఇందులో పెట్టిన మితిమీరిన కమర్షియల్ అంశాలు మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కి పెద్దగా రుచించకపోవచ్చు. అక్కడక్కడా లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది.
ఎడిటింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంది. సినిమా నిడివి సమయం, కొన్ని సీన్లు మరింత ప్రభావవంతంగా చేయవచ్చు

మహిళల హక్కులు వారి ముందడుగు పైన మొదటి అర్ధ భాగం కథ కొంతమందికి విసుగు తెప్పించవచ్చు. ఈ పాయింట్ ను ఇప్పటికే ఎంతో మంది ఎన్నో రకాలుగా తెరపైన చూపించారు.

విశ్లేషణ

మొత్తానికి సిటిమార్ ఒక మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ కథాంశంతో విజిల్ మూమెంట్స్ దర్శకుడు ఎంతోబాగా తీశాడు. మణిశర్మ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. నటీనటులంతా పరిధిమేర నటించారు. ప్రధానపాత్రలో నటించిన భూమిక, రమేష్ క్యారెక్టర్లు కూడా బాగా సెట్ అయ్యాయి. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఇంటిల్లపాది వెళ్లి చూడవలసిన సినిమా. గోపీచంద్ కు ఎంతో అవసరమైన కం బ్యాక్ ఫిలిం.

చివరి మాట: థియేటర్లలో సీటీ కొట్టించిన గోపీచంద్


Share

Related posts

Uppena : బుల్లితెర మీద షాకిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు..!

GRK

మరోసారి తెరమీదకు “శివమణి” కాంబినేషన్..??

sekhar

ప్లాన్ మార్చి… పాఠం నేర్చుకుంటున్న జగన్…!

Srinivas Manem