Gopichand : యాక్షన్ హీరో గోపీచంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేక బాగా వెనకబడిన సంగతి తెలిసిందే. గౌతం నంద సినిమా లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు తన నుంచి సినిమా ఏదీ రాలేదు. కరోనా ఎఫెక్ట్ తో గత ఏడాది నుంచి ఆయన నటించిన సీటీమార్ కి అన్నీ రకాలుగా అంతరాయం కలుగుతూనే ఉంది. షూటింగ్ దశలో ఉండగా బ్రేక్ పడింది. తీరా అన్నీ కార్యక్రమాలు పూర్తయి రిలీజ్ చేయాలనుకుంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది.
అయితే ఈ గ్యాప్ లో సీటీమార్ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఊర మాస్ బీట్తో పక్కా తెలంగాణ యాసలో సాగిన జ్వాలారెడ్డి సాంగ్ రికార్డ్ స్థాయిలో యూట్యూబ్ వ్యూస్ రాబట్టి హాట్ టాపిక్ అయింది. అంతేకాదు తాజాగా ఈ సాంగ్ 15 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ప్రసారమవుతున్న ఈ సాంగ్ చాలామందికి ఫేవరేట్ సాంగ్ అయిపోయింది.
Gopichand : సీటీమార్ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.
దాంతో సీటీమార్ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. అభిమానులు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారట. చూడాలి మరి మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు కాబట్టి ఎలాగూ రిలీజ్ కి రెడీ ఉంది కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కాగా గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తో ఆగిపోయింది.