Gopichand : గోపీచంద్ – మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన లేటెస్ట్ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించాడు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్స్.. తమన్నా, గోపీచంద్ ల లుక్.. అలాగే ఇటీవల వచ్చిన జ్వాలా రెడ్డి అన్న సాంగ్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి. ఫస్ట్ టైం గోపీచంద్ కెరీర్లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కగా కబడ్డీ నేపథ్యం ఎంచుకున్నారు. ఆంధ్రా జట్టుకు గోపీచంద్.. తెలంగాణ జట్టుకు తమన్నా కోచ్‌లుగా నటించారు.
ఇక ఈ సినిమా అన్నీ కార్యక్రమాలని పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ డేట్ లాక్ చేసుకొని ఎప్పుడో అధికారకంగానూ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ డేట్ కి సీటీమార్ సినిమా చేయవద్దని డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి చేశారట. దాంతో దర్శక, నిర్మాతలు చేసేదేమీ లేక సీటీమార్ సినిమాని అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం లేదంటూ తాజాగా ప్రకటించారు. అయితే అందుకు కారణం వేరే సినిమాలని క్లారిటీగా తెలుస్తోంది.
Gopichand : వైల్డ్ డాగ్ తో సీటీమార్ పోటీ అంటే వసూళ్ళ పరంగా ఇబ్బందులు..!
గత ఏడాది నుంచి కరోనా దెబ్బకి అనుకున్న సినిమాల రిలీజ్ డేట్ లు.. షూటింగ్స్ డేట్స్ అన్నీ తారుమారయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్ని వరస పెట్టి ఈ ఏడాది వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలకి పెద్ద గ్యాప్ ఉండకుండా రిలీజ్ చేసేస్తున్నారు. వాస్తవంగా సీటీమార్ ఏప్రిల్ 2న రిలీజ్ డేట్ లాక్ చేసుకోగా అదే రోజున నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో వైల్డ్ డాగ్ తో సీటీమార్ పోటీ అంటే వసూళ్ళ పరంగా ఇబ్బందులు వస్తాయని సీటీమార్ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.