Categories: న్యూస్

Gorintaku: గోరింటాకు ఆషాడంలో ఎందుకు పెట్టుకోవాలంటే..?

Share

Gorintaku: మార్కెట్లోకి ఎన్నో రకాల మెహందీలు అందుబాటులోకి వచ్చినాగాని గోరింటాకుకు ఉన్న ప్రత్యేకత మాత్రం ఏ కాలంలో కూడా తగ్గదు అనే చెప్పాలి.ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు ఒక ప్రత్యేక పాత్రను సంతరించుకుంటుంది. ఆడవాళ్లు ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవటానికి ఎంతో మక్కువ చూపిస్తారు.ఆషాఢం నెలలో ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలి అంటూ మన పెద్దలు ఎప్పటినుండో మనకు చెబుతూ ఉంటారు.కాలం మారుతున్న కానీ ఆషాడంలో గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం మాత్రం మారలేదు. పూర్వకాలం నుంచి వచ్చిన ఈ గోరింటాకు సాంప్రదాయం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.గోరింటాకును కేవలం చేతులు ఎర్రగా పండడానికి మాత్రమే పెట్టుకుంటారు అని అనుకుంటే పొరపాటు పడినట్లే.ఎందుకంటే గోరింటాకు పెట్టుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గోరింటాకు పెట్టుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

వర్షాకాలం మొదలయిన సమయంలోనే ఆషాఢం మాసం కూడా మొదలవుతుంది. వర్షాలు పడే సమయంలో సూక్ష్మజీవులు ఎక్కువ అవుతాయి. ఫలితంగా అంటువ్యాధులు ప్రభలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.నిజానికి మహిళలు ఎక్కువ సమయం పాటు నీటిలో పనిచేయడం వలన వాళ్ల చేతులు, కాళ్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. అందువలన ఆడవాళ్లు త్వరగా అంటు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆడవాళ్లు చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

 

గర్భసాయ సమస్యల నివారణ:

అలాగే ఆడవాళ్ళ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధానమైన నాడులు ఉంటాయి.అందుకే ఆడవాళ్లు అరచేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది.దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆడవాళ్లు సంతాన సంబందింత సమస్యల నుండి రక్షణ పోంది ఆరోగ్యంగా ఉండొచ్చు. నిజానికి గోరింట చెట్టు ఆకులే కాకుండా గోరింటాకు పూలు, వేళ్లు, బెరడు, విత్తనాల అన్ని కూడా ఉపయోగపడతాయి అనే చెప్పాలి.కాలేయ సంబంధిత సమస్యల్ని నివారించడానికి, కామెర్ల వ్యాధి చికిత్సకు గోరింటాకు చెట్టు బెరడును ఉపయోగిస్తారు. చర్మంపై వచ్చే అలర్జీలను తొలగించడానికి గోరింటాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

శరీరంలో అధిక ఉష్ణోగ్రత తగ్గుదల :

గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే అధిక ఉష్ణోగ్రత తగ్గుతుంది.కేవలం ఆషాఢం మాసం అనే కాకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా గాని గోరింటాకు పెట్టుకోవడం ఎప్పటినుండో ఆనవాయితీగా వస్తుంది.బయట దొరికే కోన్స్ కంటే గోరింటాకు పెట్టుకోవడం శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే గోరింటాకు మన శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల మన శరీరం ఎరుపు రంగులోకి మారుతుంది.కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు.కాబట్టి కోన్స్ విషయంలో జాగ్రత్త వహించాలి.

గోరింటాకు ఎర్రగా పండడానికి చిట్కాలు :

గోరింటాకు ఎర్రగా పండాలంటే రుబ్బేటప్పుడు కొంచెం చక్కెర, రెండు లవంగాలు వేసి రుబ్బితే గోరింటాకు ఎర్రగా పండుతుంది. అలాగే పెట్టుకున్న గోరింటాకు ఆరిపోయిన తర్వాత చక్కెర,నిమ్మరసం కలిపిన మిశ్రమంలో ముంచిన దూదితో చేతిపైన అద్దాలి. లేదంటే గోరింటాకు ఆరిపోయిన తరువాత కాస్త కొబ్బరినూనె రాసుకుంటే ఎర్రగా పండుతుంది.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

28 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

1 hour ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

1 hour ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

2 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

3 hours ago