మ‌రో 43 చైనా యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం!

చైనాను ఎన్ని విధాలుగా క‌ట్ట‌డి చేసినా కానీ దాని తీరు మార‌డం లేదు. భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ఏదో ర‌కంగా గొడ‌వ చేసేందుకు దూకుడుగా వ్య‌వ‌హిస్తోంది. ఇప్ప‌టికి ఆ దేశ దూకుడును క‌ట్ట‌డి చేసేందుకు ఎన్నో చైనా బ్రాండ్లను కేద్రం ప్ర‌భుత్వం బ్యాన్ చేస్తూ.. వ‌స్తోంది. అయినా కానీ ఆ దేశం ఇంకా ఇలాంటి ప‌నుల‌ను మాత్రం ఆప‌డం లేదు. దాంతో కేంద్ర ప్ర‌భుత్వం దేశ ర‌క్ష‌ణ దృష్ట్యా ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటుంది. అందులో భాగంగా మ‌రిన్ని చ‌ర్య‌ల‌కు పూనుకుంది.

సమాచార గోప్యత విష‌యంలో ఇప్పటికే మ‌న కేంద్ర ప్ర‌భుత్వం 177 చైనా యాప్‌లపై నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే.. ఎన్ని చేసినా చైనా ఇంకా త‌న దూకుడుత‌నాన్ని పెంచుతున్న ఈ త‌రుణంలో కేంద్రం మ‌రికొన్ని చైనా యాప్స్ లపై నిషేధం విధించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని చైనా దేశం నుంచి కార్యకలాపాలు చేస్తున్న మరో 43 యాప్స్ పై చ‌ర్య‌లు తీసుకుంది మ‌న కేంద్ర ప్ర‌భుత్వం.

హోంమంత్రిత్వశాఖ ఆధ్వ‌ర్యంలో సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ కేంద్రం దీనిపై సమగ్రంగా చ‌ర్చించింది. అనంత‌రం ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ అప్లికేష‌న్ల‌పై నిషేధం విధించినట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్పుడు నిషేధం విధించిన వాటిల్లో అలీఎక్స్‌ప్రెస్‌, స్నాక్‌ వీడియో, మ్యాంగో టీవీలు కూడా ఉన్నాయి.

ఐటీ చట్టం 69ఎ సెక్షన్‌ ప్రకారం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. ఇప్పుడు నిషేధించిన అప్లికేష‌న్ల‌ల్లో చైనా రిటైల్ అతి పెద్ద కంపెనీ అయినా అలీబాబా గ్రూప్‌నకు చెందిన 4 అప్లికేష‌న్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు చైనాకు చెందిన మ‌రిన్ని అప్లికేష‌న్లు ఉన్నాయి.

గల్వాన్ లోయ వద్ద చైనా చేసిన దుందుడుకు చర్యలకు బుద్ధి చెప్పేందుకు జూన్ 29 రోజునా చైనాకు చెంద‌న 59 అప్లికేష‌న్ల‌పై మ‌న కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 2వ రోజున‌ పబ్జీ గేమ్ యాప్ తో పాటు మ‌రో 118 అప్లికేష‌న్ల‌పై నిషేధం విధించింది మ‌న కేంద్ర ప్ర‌భుత్వం.