NewsOrbit
న్యూస్

YCP Social Media: వైసీపీ సోషల్ మీడియా పోస్టింగుపై దుమారం!ఎవరికి “బలిసింది”అని ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర ఆగ్రహం

YCP Social Media: పీఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించిన తరుణంలో వారిని సముదాయించాల్సింది పోయి రెచ్చగొట్టే ధోరణిలో వైసీపీ సోషల్ మీడియా లోని కొందరు ప్రముఖులు పెడుతున్న పోస్టింగులు అగ్నికి ఆజ్యం పోసేవిగా ఉన్నాయి.

Government Employees Serious on YCP social media posting!
Government Employees Serious on YCP social media posting

పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ జోలికొస్తే ఎవ్వరినీ వైసీపీ సోషల్ మీడియా ఉపేక్షించదన్నది అందరికీ తెలిసిందే.అవే సంకేతాలు ఈ పోస్టింగులు ఇస్తున్నప్పటికీ ఇవి బరితెగింపు ధోరణిలో ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మండిపడుతున్నారు.

కొద్దిగా వెనక్కి వెళితే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తాజా పీఆర్సీని ప్రకటించింది.అయితే ఆ పీఆర్సీ ప్రకారం తమ జీతాలు పెరగకపోగా తగ్గుతున్నాయంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఆందోళన చేపట్టారు.ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లను వారు ముట్టడించారు. వేలాది మంది పాల్గొనడంతో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జయప్రదమైంది.ఆ ఫొటోలను, వీడియోలను చూశాక వైసీపీ సోషల్ మీడియా కౌంటర్లివ్వడం మొదలెట్టింది.ఇవి ఫేక్ ఫొటోలని,ఎన్నికల ప్రచారం సందర్భంగా జనాలు ఉన్న ఫొటోలను చూపిస్తూ ఇదంతా ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని వారు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు.అయితే ఆ ఫోటోల్లోనే ఫ్యాప్టో,యూటీఎఫ్ తదితర జెండాలు ఉన్నా అవి వైసిపి వీరాభిమానులకు కనిపించకపోవటం గమనార్హం.

YCP Social Media: హద్దులు దాటిన దేవేంద్ర రెడ్డి!

ఇదంతా ఒకెత్తయితే వైసీపీ సోషల్ మీడియా లో కీలకపాత్ర పోషించే గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్టింగ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడో కాలేలా చేసింది.”ఉద్యోగులు బలిసి కొట్టుకుంటున్నారు. పీఆర్సీ లేదు.హెచ్ఆర్ఏ లేదు.జగనన్నా వీళ్లందరినీ తీసేయండి.ఇంతకు సగం శాలరీకి చాలామంది దొరుకుతారు’అని దేవేందర్ రెడ్డి ట్వీట్ చేశారు.ఆ ట్వీటును ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా రీట్వీట్ చేస్తూ, తమ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టింగులు చేస్తూ ఆయనపై భగ్గుమంటున్నాయి.జీతాలు తగ్గాయని తాము బాధపడుతుంటే బలిసిందని తమను అంటారా అని పలువురు నేతలు నాలుక పీక్కున్నారు.ఆ పోస్టింగ్ చూస్తే ఎవరికి బలిసిందో అర్థమవుతోందని కూడా వారు కౌంటర్ ఇచ్చారు.ఏదేమైనా ఇది ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన సమస్య అయితే మధ్యలో వైసిపి సోషల్ మీడియా దూరడం వల్ల అగాధం పెరగడమే కాకుండా సిఎం కే చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది.

 

author avatar
Yandamuri

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N