సర్కారు కొలువు ఏమంత సులువు కాదు..! కానీ ఇవి పాటించండి చాలు..!!

 

ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరికీ మక్కువే..! అందులోని ప్రత్యేకతలు అలా ఉంటాయి..! ఒకసార ఒక్కసారి సాధిస్తే భవిష్యత్తంతా సాఫీగా సాగిపోతుంది..! సమాజంలో మంచి హోదా.. ఉద్యోగ భద్రతతో పాటు, ఆరోగ్య భీమా, ఇతరత్రా చక్కని సదుపాయాలు.. వంటివి సొంతమవుతాయి. అయితే దీన్ని సాధించటం అంత సులువేమీ కాదు..? అలా అని కష్టం కూడా కాదు..? పసుతం ప్రస్తుతం అం ఉన్న తీవ్రమైన పోటీని ఎదుర్కోవాలి.. అందరికంటే మెరుగైన ప్రతిభ చూపి నెగ్గాల్సివుంటుంది.. ఆ లక్ష్య సాధనకు సిద్ధమవ్వండిలా…

అందుకే బ్యాంకింగ్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, యూపీఎస్‌సీ, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ప్రకటించే నోటిఫికేషన్ల ద్వారా కొలువులు సాధించి జీవితాల్లో స్థిరపడాలని యువతీ యువకులు ఆశిస్తున్నారు. అయితే ప్రకటించే ఉద్యోగాల సంఖ్య వేలల్లో, ఉద్యోగార్థులు లక్షల్లో ఉండటంతో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నిరుద్యోగులు తమ లక్ష్యాన్ని చేరే అవకాశం కనిపిస్తోంది. అటువంటి అత్యధిక స్థాయి పోటీలో రాణించి సర్కారీ ఉద్యోగాలకు ఎంపికవ్వాలంటే… వారి ఆలోచనా ధోరణి, పోటీ వైఖరిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి..

అభ్యర్థి తన బలాలు, బలహీనతలు, వనరులు, అవరోధాలు మొదలైన వాటికి అనుగుణంగా ఓ నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి.. సుదీర్ఘ పోరుకు సంసిద్ధత అవ్వాలి. ఓపిక, సుదీర్ఘ ప్రయత్నం చేయగలం.. అనుకున్నప్పుడే ఈ పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపటం శ్రేయస్కరం. ఉద్యోగం సాధించాలనే ఉత్సాహం రోజులు గడిచినకొద్దీ పల్చబడకుండా, ప్రేరణ కాలక్రమంలో కరిగిపోకుండా జాగ్రత్తపడాలి. ఒక ప్రయత్నం చేసి అలా ఫలితం పొందాలని అస్సలు ఆశించవద్దు. కనీసం రెండు సంవత్సరాల సమయాన్ని నిర్దేశించుకోవాలి. రాష్ట్ర సర్వీస్‌ కమిషన్లలో ఉండే కొన్ని అవరోధాల మూలంగా కొన్ని సందర్భాల్లో 3-5 సంవత్సరాలు కూడా ఎదురుచూడాల్సి ఉంటుంది.

మొదటగా ఏ ఉద్యోగానికి వెళ్లాలనుకుంటున్నారో మీకు మీరు ఓ స్పష్టత తెచ్చుకోవాలి. నేను ఏ ఉద్యోగానికివెళ్తున్నాను? నోటిఫికేషన్ ఏవిధంగా పడింది? ఉద్యోగంపేరేంటి? ఇలా పూర్తిగా స్పష్టతతో ఉండాలి. దానికి సంబందించిన సిలబస్‌ను పూర్తిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ సిలబస్‌పై పట్టు సాదించాలి. అందుకు తగ్గట్టుగా సరైన పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. సాధ్యమైనన్ని ఎక్కువ పేపర్లను మీరు ప్రాక్టీస్‌ చేయాలి. ఎక్కవ పేపర్లు ప్రాక్టీస్‌ చేయ్యడం ద్వారా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిలబస్‌ గురించిన సమాచారాన్ని మైక్రోషీట్‌లో రెడీచేసుకోవాలి. . ఈ మైక్రోషీట్‌తో నెల రోజు టైం టెబుల్‌ను సిద్దం చేసుకోండి.చివరి భాగం విజయమే. కాంపిటేటివ్‌ పరీక్షలలో ఈ సూత్రాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూపాటించాలి. అతితక్కువ సమయంలోనే ప్రణాళిక, పట్టుదలతో చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. మీకు సబ్జేక్ట్‌పై పట్టులేకుండా ఎన్ని గంటలు చదివినా అది వృధా అవుతుంది. కాబట్టి ఎన్ని గంటలు చదవాలి అనేది ముఖ్యం కాదు. చదివిన కొద్ది సేపు సబ్జెక్ట్‌పై పట్టు వచ్చేలా చదవాలి. నిబద్ధతతో చదివితే మీరు కోరుకున్న ప్రభుత్వం మీ సొంతం అవుతుంది.

చిన్న పోటీ పరీక్షలకు కూడా లక్షల్లో అభ్యర్థులు ఉంటారు. భిన్నంగా- పోటీదారుల నుంచి నేర్చుకుంటూ మనల్ని మనం మెరుగుపరుచుకునే ధోరణిని అలవర్చుకోగలిగితే..? మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. పోటీదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న కొద్దీ అభ్యర్థులు తమ శక్తుల్ని మరింతగా పెంచుకునే వైఖరిని ఏర్పర్చుకోవాలి. పరాజయాన్ని ప్రేమించాలి.
నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక సందర్భాల్లో పరాజయాలు రావడం సహజమైన విషయం. వస్తున్న పరాజయాలకు నిరాశలో కూరుకుపోయి లక్ష్య సాధన నుంచి పక్కకి వెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువ. అలా కాకుండా వచ్చిన ప్రతి పరాజయాన్నీ స్వీకరించాలి, ప్రేమించాలి. అంటే దాన్ని అంగీకరించడం, లోపాలను పరిష్కరించుకోవడం, పరిపుష్ఠం కావడం. పరాజయాన్ని అంగీకరించగలిగిన వైఖరి ఉన్నప్పుడు అదే విజయానికి రాచబాట అంటారు మనోవిశ్లేషణ వేత్తలు. అంతిమ లక్ష్యాన్ని సాధించేవిధంగా ప్రణాళికలు రూపొందించుకున్నవారే అంతిమ విజేతలు.

ఒకవేళ అపజయం వస్తే ఏమి చేయాలి? అనే ఆలోచనతో పకడ్బందీగా ప్లాన్‌-బిని రూపొందించుకుంటే విజయానికి అవరోధంగా నిలిచే ఒత్తిడి దూరమవుతుంది.‘ఏ కారణం వల్లనైనా దీనిలో నెగ్గకపోతే ప్రత్యామ్నాయం ఉంది’ అనే ఆలోచన అభ్యర్థుల్లో ఒక తెలియని మానసిక స్థిరత్వాన్ని కల్పిస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచనల్ని ఏర్పరుచుకోవాలి.