NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మార్పుల మూల కథ… ఆ చీకటి కోణమే కదా…!

మొన్న శిద్దా హనుమంతరావు…, సూర్యప్రకాసరావులు… నిన్న కరణం బలరాం…, నేను శిద్దా రాఘవరావులు… వీళ్ళందరూ ప్రకాశం జిల్లా నాయకులు, వైసీపీకి ఆకర్షితులై జగన్ వెంట చేరుతున్నారు అనేది బయటకు తెలిసిన సత్యం. ఈ సత్యం వెనుక కొన్ని చీకటి కారణాలున్నాయి. వందల కోట్ల లావాదేవీలున్నాయి. వారసుల భవిష్యత్తులున్నాయి. అవేమిటో తెలుసుకుంటే ఆ జిల్లాలో రాజకీయం, అసలు రంగు తేలుతుంది..

ఇవన్నీ చెప్పుకోవాలంటే దశలు.., సీన్లు వారీగా చెప్పుకోవాలి. ప్రతీ సీన్ లోనూ తెర వెనుక, ముందు అనేకం ఉన్నాయి. అవే కీలకం. ఈ సీన్లన్నీ చూసుకుని…, చదువుకుని అతికించుకుని మళ్ళీ చూసుకుంటే సినిమా కనిపిస్తుంది. ఆ సినిమా పేరు చివర్లో చెప్పుకుందాం.

సీన్1 : గత ఏడాది మే నెలలో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జులై నెలలో ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ తనిఖీలు మొదలయ్యాయి. రెండు నెలల పాటూ భారీగా జరిగాయి. ఎన్నడూ లేనంతగా పక్క జిల్లాల అధికారులు వచ్చి… గనుల శాఖ, విజిలెన్స్, మైనింగ్ లోని అంతర్గత విజిలెన్స్, రెవెన్యూ… ఇలా నాలుగు శాఖల తలలు దూర్చి రెండు నెలలపాటు తక్కెడ వేసి అక్రమాలను నిగ్గు తేల్చాయి. 42 గ్రానైట్ క్వారీలకు రూ. 2085 కోట్లు ఫైన్ వేసాయి.

సీన్2 : శిద్దా కుటుంబాలకు గ్రానైట్ వ్యాపారమే ముఖ్యం. ఆ వ్యాపారం ద్వారానే వందల కోట్లకు పడగలెత్తారు. జిల్లాలో రాజకీయాలను శాసించారు. అటువంటి సంస్థలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. శిద్దా కుటుంబాలకు చెందిన క్వారీలకు దాదాపు రూ. 900 కోట్ల ఫైన్ పడింది. దీంతో తమ బండారం బయట పడుతుందేమో… ఎలాగైనా కాపాడాలి అంటూ శిద్దా సోదరులు హనుమంతరావు, సూర్య ప్రకాశరావులు జగన్ ని కలిసి పాహిమాం అంటూ పార్టీలో చేరిపోయారు. వీళ్ళకి అసలు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేదు, అసలు వీళ్ళు ఏ పార్టీలోనూ పని చేయలేదు. అటువంటిది ఫైన్ లు వేసిన నెల రోజుల్లోనే జగన్ పక్కకు వచ్చేసారు.

సీన్3 : గ్రానైట్ వ్యాపారులు కొందరు కోర్టుకి వెళ్లారు, కొందరు పాహిమాం అంటూ వేడుకున్నారు, కొందరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు, కొందరు వాటాలు అమ్మేశారు. ఇలా 42 క్వారీలు యజమానులూ చెల్లా చెదురయ్యారు. ఓ గ్రానైట్ క్వారీకి ప్రభుత్వ అనుబంధంగా కీలక పదవిలో ఉన్న నాయకుడికి 50 % వాటా…, మరో నాయకుడికి 30 % దక్కిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా సర్దుబాట్లు కలిగి… కొంత సద్దుమనిగాయి.

సీన్4 : ఇలా ఫైన్ నుండి తప్పించుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కో బాట పట్టారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, శిద్దా రాఘవరావులు కోర్టుకి వెళ్లారు. స్టే తెచ్చుకున్నారు. తాత్కాలికంగా ఉపశమనం ఉన్నప్పటికీ ఇది పరిష్కారం కాదు అని తెలుసుకున్నారు. అక్రమాలు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత వారు ఫైన్ కట్టక తప్పదు. అందుకే… రవికుమార్ తనకు తెలిసిన వారితో జగన్ వద్దకు, ప్రభుత్వ పెద్దల వద్దకు రాయబారం నడుపుతుండగా.., శిద్దా రాఘవరావు తలొంచారు. ఫైన్ లో కొంత మాఫీ…, వచ్చే ఎన్నికల్లో ఎక్కడో ఓ చోట సీటు అనే ఒక ప్రాధమిక హామీతో నేడు పార్టీలో చేరనున్నారు.

సీన్5 : కొందరు పార్టీలు మారారు, కొందరు కోర్టుకి వెళ్లారు… చివరికి.., మొత్తానికి అతిపెద్ద గ్రానైట్ చీకటి సామ్రాజ్యాన్ని ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తెచ్చేసుకుంది. దీనిలో ఆ జిల్లా మంత్రి సహా రెండో వైపు నుండి మరో నాయకుడు కీలక పాత్ర పోషించారు. ఇక కరణం బలరాం సంగతి చూసుకుంటే…వీరి పేరునా ఓ క్వారీ సంస్థ ఉంది. రూ. 35 కోట్లు ఫైన్ వేశారు. కాకపోతే ఇది వీళ్ళు నిర్వహించడం లేదు, లీజుకి ఇచ్చామంటూ చెప్పుకుంటున్నారు. కానీ వీరి పేరునే లెటర్ లు, ఫైన్ లు వచ్చాయి. క్వారీ లీజు ఉంది. సో… ఇలా ఒక్కొక్కరు ఒక్కో అంశం పరమావధిగా పార్టీలో చేరికలు జ్ బేరసారాలు నడుపుతున్నారు.

సీన్6 : ఇక్కడ గ్రానైట్ అనేది ప్రధాన కారణం. కానీ ఇంకో కారణం కూడా కీలకంగా ఉంది. అదే కుమారుల భవిష్యత్ పై బెంగ. కరణం బలరాం, శిద్దా రాఘవరావుల మార్పులో ఇది కూడా కీలక అంశమే. కరణం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకు ముందు వారి రాజకీయం అద్దంకిలో ఉండేది. టీడీపీలోనే ఉంటే నెట్టుకురాలేము, భవిష్యత్ కష్టమే అనుకుని… వైసీపీలో చేరారు. అదే క్రమంలో శిద్ధాకు కూడా నచ్చచెప్పి తీసుకొస్తున్నారు. ఇక “మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన” అనే సూత్రం గుర్తు పెట్టుకుంటే…. ఇప్పుడు చేరిన ఈ నాయకులు అందరికీ ఎమ్మెల్యేల స్థాయి. ఆపై స్థాయి. మరి వీళ్ళను వచ్చే ఎన్నికల నాటికి ఎక్కడ సర్దుబాటు చేస్తారు..? ఎక్కడ దింపుతారు…?? చూడబోతే ఇది కూడా 2014 – 2019 మధ్య కర్నూలు ఎంపీ “బుట్టా రేణుక” వ్యవహారం లాగానే ఉంది. వేచి చూద్దాం… జగన్ ఎలా సర్దుబాటు చేస్తారో….??
ఈ సినిమా పేరు “గ్రానైట్ ఇక రైట్… రైట్”!!

author avatar
Special Bureau

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!