NewsOrbit
న్యూస్

Corona Virus: కరోనా నివారణకు “మహా” పథకం!ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించటం బెస్ట్!

Corona Virus: అర కోటికి పైగా పాజిటివ్ కేసులు, దాదాపు లక్షకు చేరువలో కరోనా మరణాలతో సెకండ్ వేవ్ లో భారతదేశంలోనే తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్ర ప్రభుత్వం తనకు సాధ్యమైనంతగా ఈ ఉద్ధృతిని తగ్గించడానికి చర్యలు తీసుకుంది.కొద్దిగా పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా రోజూ వేల సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో ఒక వినూత్న పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

"Great" plan for corona virus prevention!
Great plan for corona Virus prevention

ఆ పథకమే “మై విలేజ్ కరోనా ఫ్రీ”

కేవలం 16 కోట్ల రూపాయల ఖర్చుతో గ్రామాల నుండి కరోనాను తరిమేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని ప్రకటించింది.కొన్ని గ్రామాల్లో ఇప్పటికే స్వచ్ఛందంగా కరోనాను నిర్మూలించేందుకు గ్రామస్థులు తగిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వాటిని అధ్యయనం చేశాక “మై విలేజ్ కరోనా ఫ్రీ”పోటీ పథకాన్ని ప్రకటించారు.ఈ పథకంలోని ముఖ్య అంశమేంటంటే ఏయే గ్రామపంచాయతీలైతే కరోనా రహిత గ్రామాలుగా తయారవుతాయో వాటికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు. మహారాష్ట్రలో ఉన్న ఆరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మూడేసి గ్రామ పంచాయతీలకి అంటే మొత్తం పధ్ధెనిమిది గ్రామాలకు నగదు బహుమతులు అందజేస్తారు.ఆ నగదు బహుమతి కూడా భారీగానే ఉంది.

Read More: Corona: క‌రోనాతో కాదు ఎలుక‌ల‌తో చ‌స్తున్నాం… భార‌త్ ను స‌హాయం కోరిన ఆ దేశం

ఈ పోటీ పథకం వివరాలు!

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ బుధవారం ఈ పోటీ పథకం వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విభాగంలో కొవిడ్ -19 నిర్వహణలో మంచిగా పని చేస్తున్న మూడు గ్రామ పంచాయతీలకు బహుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.గెలిచిన గ్రామాలకు మొదటి బహుమతి రూ. 50 లక్షలు, రెండవది రూ. 25 లక్షలు, మూడవ బహుమతి రూ. 15 లక్షలుగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆరు రెవెన్యూ విభాగాలు ఉండగా, మొత్తం 18 బహుమతులు ఇస్తారు. ఇందుకోసం 16.20 కోట్లు ప్రైజ్ మనీగా ఖర్చు చేస్తారు. పోటీలో గెలిచిన గ్రామాలకు బహుమతి డబ్బుతోపాటు, దానికి సమానమైన అదనపు మొత్తాన్ని ప్రోత్సాహంగా ఇస్తారని.. ఆ నిధులు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు మరింత ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.ఇరవై రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుని వాటిలో ర్యాంకింగులు ఇచ్చి రెవిన్యూ డివిజన్ల వారీగా మొదటి మూడు స్థానాలు పొందిన పంచాయతీలను ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు.ఆసక్తి దాయకంగా ఉన్న ఈ పథకం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరణీయంగానే కనిపిస్తోంది.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?