Banana tree: శతభిష,పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్రం ఈ మొక్కలు పెంచండి!!

Share

Banana tree:  శతభిష నక్షత్రం లో పుట్టిన  వారు కడిమి చెట్టు పెంచడం   కానీ  అరటి చెట్టు ని  పెంచడం కానీ  చేస్తే   శరీర పెరుగుదలకు సంబంధించిన సమస్య , మోకాళ్ళ కి సంబంధించిన  సమస్యలు తగ్గుతాయి. చక్కని శరీర సౌష్టవం కలగడంతో పాటు , మంచి ఉద్యోగం  తో  జీవితం లో  బాగా  స్థిరపడతారు. పూర్వాభాద్ర నక్షత్రం లో పుట్టిన  వారు మామిడి చెట్టు ని  పెంచితే  కండరాలు, పిక్కల కు సంబంధించిన సమస్యలు  ఉండవు. వృత్తి ,ఉద్యోగంలో మంచి స్థితి ని తెచ్చి పెట్టడానికి  కళలు, సాంస్కృతిక రంగాల్లో  గొప్ప పేరు సంపాదించుకోవడానికి,  విదేశాల లో తిరిగే అవకాశం పొందడానికి , ఆర్ధికం గా   స్థిరంగా ఉండడానికి , రాజకీయం లో   ఎదగడానికి  సహాయపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు వేప చెట్టు ని  పెంచితే  శ్వాసకోశ సంబంధిత సమస్యలు  ,కాలేయ సమస్యలు రాకుండా ఉంటాయి. ఉన్నత పదవులు పొందడానికి  వీటితో పాటు  విదేశాల్లో ఉన్నత  చదువులు చదవడానికి , సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు  కలగడానికి , వైవాహిక జీవితం   ఆనందంగా ఉండేలా చేస్తుంది.

రేవతి నక్షత్రం  లో పుట్టిన వారు విప్ప చెట్టు ని  పెంచిన , పూజించిన    థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో  ఉండడం తో పాటు మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం  పొందడానికి , కీలక పదవులు చేపట్టడానికి , సంతానం యొక్క  ప్రేమ పొందడానికి , గౌరవం, అప్యాయతలు   పెరగడానికి, జీవితం లో అందరి సహాయ సహకారాలు  అందుతాయి.కాబట్టి ప్రతి ఒక్కరు తమ తమ నక్షత్రాన్ని బట్టి మొక్కలు పెంచితే మీ జీవితం బాగుండడం తో పాటు,పర్యావరణం కు  కూడా మేలు జరుగుతుంది


Share

Related posts

ఈ ధోరణి కరక్ట్ గా లేదు… వైకాపాలో అంతర్గత డిస్కషన్లు!

CMR

జగన్ – బాబు కొట్టుకోండి .. మధ్యలో మమ్మల్ని ముంచకండి – తిరగబడుతున్నారు వీరంతా ! 

sekhar

Vijayashanthi: సీఎం కేసిఆర్ విధానాలను తూర్పారపడుతూ విజయశాంతి సెటైర్‌లు..

somaraju sharma