పెరుగుతున్న బంగారం ధరలు

ఢీల్లీ జనవరి1: నూతన సంవత్సరంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.  బంగారానికి వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ఈరోజు బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 200 రూపాయలు పెరిగి 32,470కి చేరింది. వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర 150 రూపాయలు పెరిగి 39,250గా ఉంది. పారిశ్రామిక వర్గాలు,నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

2018లో బంగారం ధరలు పెరిగాయి. ఏడాది మొత్తంలో పది గ్రాముల స్వచ్చమైన బంగారం ధరపై 1870 రూపాయల దాకా పెరిగింది. దాదాపు 6.15 శాతం పెరిగాయి.2017 డిసెంబర్ 30వ తేదీన పది గ్రాముల బంగారం ధర 30,400గా ఉండగా 2018 చివరకు అది 32,270కి చేరింది. అలాగే 2018లో కేజీ వెండి ధరపై 880 దాకా తగ్గింది. దాదాపు 2.2 శాతం తగ్గినట్లు. 2017 డిసెంబర్ 30వ తేదీ నాటికి కేజీ వెండి ధర 39,980గా ఉండగా 2018 చివరకు 39,100కి చేరింది.