తెలంగాణ‌ న్యూస్

కేటీఆర్ కు పెరుగుతున్న స్వాగత బాజాలు!నిన్న మంత్రి.. నేడు ఎమ్మెల్యేలు!అంతా కెసిఆర్ వ్యూహమేనా?

Share

తెలంగాణలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది.నిన్నటికి నిన్న తెలంగాణ సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ ఈ విధమైన సంకేతాలు ఇవ్వగా ఇప్పుడు కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే పల్లవి అందుకున్నారు.

గత కొన్ని రోజులుగా కేటీఆర్‌ ముఖ్యమంత్రి కానున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి స్వీకరించనున్నారని చర్చలు జరుగుతోన్న వేళ నిజమాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

బోధన్ ఎమ్మెల్యే ఏమన్నారంటే!

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ తన మనసులోని మాట బయటపెట్టారు. ఇందూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్‌ సమర్థుడు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్‌ అధ్యక్షతన జరగాలని కోరుకుంటున్నాను. యువనేత కేటీఆర్‌ను సీఎం చేయాలని మేమంతా ఆశిస్తున్నాం. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కేటీఆర్‌ సీఎం అయ్యేలా ఆశీర్వదించాలి. ఇది కేవలం నా ఒక్క అభిప్రాయమే కాదు.. చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.అలాగే ఇక కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలనుందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజి రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్న వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చారు. ఈ విషయమై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆలోచించి.. కేటీఆర్‌ను సీఎం చేయాలని ఎమ్మెల్యే కోరారు..

వ్యూహాత్మకంగానే స్వాగత బాజాలు!

రాజకీయాలు ఎలా ఉంటాయంటే అధినేత తాననుకున్నది అనుచరులు చేత చేయిస్తారు.గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా తన కుమారుడు నారా లోకేషు ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చి మంత్రిని చేయాలనుకున్న చంద్రబాబునాయుడు ముందుగా అందుకు రంగం సిద్ధం చేశారు.పలువురు మంత్రులు ఎమ్మెల్యేల చేత లోకేష్ ని మంత్రిని చేయాలన్న డిమాండ్ ను వినిపించారు.ఆ తర్వాత పార్టీ నిర్ణయం ప్రకారం లోకేష్ కి మంత్రి పదవి ఇచ్చిన బిల్డప్ చంద్రబాబు ఇవ్వడం జరిగింది.ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెప్పారు.కుమారుడు కేటీఆర్కు సీఎం పీఠం అప్పగించడానికి సిద్ధంగా ఉన్న కెసిఆర్ అంతకుముందు అవసరమైన ఏర్పాట్లలో ఉన్నారట.అయితే తనంతట తానుగా కుమారుడిని ముఖ్యమంత్రిని చేసి కుటుంబ పాలనను అపప్రథను ఎదుర్కోవటం ఎందుకన్న దూరాలోచనతో కేసీఆరే మంత్రులు ఎమ్మెల్యేలు కేటీఆర్ ను స్వాగతించే ప్రచార వ్యూహాన్ని అవలంబిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 


Share

Related posts

Petrol bomb : సినీ ఇండస్ట్రీ లో పెట్రో బాంబు కలకలం.. ప్రముఖ హీరోకు గాయాలు.. ఎక్కడంటే..

bharani jella

Srivishnu : శ్రీవిష్ణు సినిమా ఓటీటీలో ప్లాన్ చేస్తున్న మేకర్స్..?

GRK

ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన ప్రభాస్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar