Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి రసవత్తరంగా సాగుతుంది. తులసి జీవితం ఏమవుతుందో?.. తన గమ్యం ఎటువైపో తెలియక అయోమయంలో పడిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమవుతుందో అనే ఆత్రుత ప్రేక్షకుల్లో ఎక్కువ అయిపోయింది. అయితే గృహలక్ష్మి సీరియల్ శనివారం రోజు ప్రసారం కాలేదు.ఈరోజు అంటే సోమవారం రోజున ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందామా. తులసికి ప్రాణముప్పు తప్పిందని డాక్టర్ చెప్పడంతో కుటుంభసభ్యులు అందరు సంతోషపడతారు.మరుసటి రోజు ఉదయాన్నే డిశ్చార్జ్ చేయగా ఇంటికి వచ్చేస్తుంది తులసి.
Intinti Gruhalakshmi: తులసి ఇల్లు వీడి వెళ్ళిపోనుందా..??
ఇంటికి వచ్చిన తులసి నేను దీపక్ దగ్గరికి వెళ్లిపోతాను. కొత్త జంటను ఇక్కడుండి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటుంది తులసి. కానీ కుటుంబసభ్యులు నువ్వు లేకుంటే మేము కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతాం అంటారు.దీంతో తులసి ఆగండి నేను ఇంట్లోనే,మీతోనే ఉంటాను అని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. తులసి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుందేమో అని లాస్య కోపంతో రగిలిపోతుంది.ఇంతలో తులసిని లోపలికి తీసుకొచ్చేందుకు హారతి తీసుకొస్తుంది అనసూయ.నీ మాజీ కోడలుకు మాత్రం హారతి పట్టి ఇచ్చావు. కానీ… ఈ కొత్త జంటకు మాత్రం హారతి ఇవ్వడానికి నీకు వచ్చిన సమస్య ఏంటి.. ఇదేనా నీ పెద్దరికం అని ప్రశ్నిస్తుంది భాగ్య.
లాస్య ఇంట్లో అడుగుపెట్టడంతోనే అపసృతి :
దీంతో తులసి.. శృతిని పిలిచి హారతి ఇచ్చి కొత్త జంటను ఇంట్లోకి ఆహ్వానించు అని చెబుతుంది. దీంతో శృతి వెంటనే ఇంట్లోకి వెళ్లి హారతి తీసుకొని వచ్చి నందు, లాస్యకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇక నందు, లాస్య ఇంట్లోకి వెళ్లే సమయంలోనే గోడకు ఉన్న పూసల దండ కింద పడుతుంది.అయ్యో లాస్య ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో అశుభం అని చెబుతుంది అనసూయ. అయినప్పటికీ.. ఇద్దరూ ఇంట్లో అడుగుపెడతారు.మరోవైపు తులసి ఆరోగ్యం కుదుటపడడంతో తను నెమ్మదిగా లేచి నడుస్తుంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటారు.
లాస్య -నందుల హనీమూన్… సంతోషంలో లాస్య:
ఇకపోతే నందును ఎక్కడికైనా దూరంగా కొన్ని రోజులు తీసుకెళ్తే వీళ్లతో ఉన్న అనుబంధం తగ్గుతుందని లాస్య హనీమూన్ కు ప్లాన్ చేస్తుంది. తులసి నువ్వు త్వరగా కోలుకుంటే అప్పుడే మాకు నువ్వు సెండాఫ్ ఇవ్వగలిగేది అంటుంది లాస్య. సెండాఫ్ ఇవ్వడం ఏంటి.. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతాడు నందు. దీంతో మనం హనీమూన్ కు వెళ్తున్నాం అని సమాధానం చెబుతుంది లాస్య. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. మరి నందు, లాస్య హనీమూన్ కి వెళ్ళారా… లేదా అనేది తరువాయిభాగంలో చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?