Subscribe for notification
Categories: న్యూస్

Gruhalakshmi: అనుకున్నంత అయిపోయింది.. పాపం తులసి గమనం ఎటువైపో..? గుండెల్ని మెలిపెట్టే సీన్.. !

Share

Gruhalakshmi: గృహలక్ష్మి సీరియల్ రోజుకో మలుపు తిరుగుతుంది. నందు లాస్యను పెళ్లి చేసుకుంటాడా? లేదా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అందరిలో. గత ఎపిసోడ్ లో లాస్య నందుని నన్ను పెళ్లి చేసుకోకపోతే జైలుకి పంపిస్తా అని నందును బెదిరిస్తుంది. లాస్య మాటలు విన్న నందు నన్ను బెదిరించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటావా? నువ్ జైలుకి పంపుతావో లేక ఉరివేయిస్తావో నీ ఇష్టం కానీ నేను నా మనసుకి నచ్చని పనిని ఎన్నటికీ చేయను చివరికి నా ప్రాణాలను వదులుకోవడానికైనా సిద్దమే. నీకు,ఈ పెళ్లికి భయపడి నేను పారిపోలేదు.అంతలా లాస్య మీద చెలరేగిన నందు చివరిలో ట్విస్ట్ ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా లాస్యా? అంటాడు. అది నీ మీద భయంతో కాదు, నా కుటుంబం మీద ఉన్న ప్రేమతో అంటూ లాస్యని తీసుకుని వెళ్లి పెళ్లి పీటలపై కూర్చుంటాడు నందు.


Migraine: పిల్లలలో మైగ్రేన్ రావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త పడండి!!

నందు -లాస్యల పెళ్లి నిజంగానే జరుగుతుందా.. లేక కలా..?

పెళ్లి తంతు ప్రారంభం అయ్యేసరికి అక్కడి నుంచి అందరు కూడా వెళ్ళిపోతారు. ఆ పెళ్లి మండపంలో ఒక్క భాగ్య మాత్రమే ఉంటుంది. ఓ పక్క వీరి పెళ్లి అవుతుంటే. మరోపక్క తులసిని చూపిస్తూ ఒక ఎమోషనల్ సాంగ్ వేసి తులసి జీవితంలో జరిగిన సంఘటనలను చూపిస్తూ అందరిని ఎమోషనల్ చేస్తారు. అసలు పెళ్లి జరుగుతుందా… మళ్ళీ ఏదన్నా అయ్యి పెళ్లి ఆగిపోతుందా అని అనుకునేలోపే నందు లాస్య తల మీద జీలకర్ర,బెల్లం పెట్టి తనని పెళ్లి కూడా లాస్య మెడలో తాళి కూడా కట్టేస్తాడు. అయితే ఇది కల అనుకునేరు. కాదు నిజంగానే లాస్య,నందుకి పెళ్లి జరిగిపోతుంది. పెళ్లైన వెంటనే అత్తయ్యా,మావయ్యల ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్లు ఉండే చోటుకి వెళ్తుంది లాస్య. వారిని చుసిన అనసూయ కోపంగా బయటకు వచ్చి ఏంటే ఇక్కడ తగలడ్డావ్ అని అంటుంది. దానితో భాగ్య సీన్ లోకి ఎంటర్ అయ్యి అదేంటి అత్తయ్యా కొడుకు కోడలు పెళ్లి బట్టల్లో ఇంటికి వస్తే అలా మాట్లాడతావ్. పెళ్లి ఎలా జరిగినా కోడలు కోడలే కదా ఇకనుంచి నా తోడు కోడలు తులసి కాదు లాస్య అంటుంది .దీంతో అనసూయకి ఒళ్ళు మండిపోయి తన విశ్వరూపం చూపిస్తుంది.. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్ మెడలో తాళి పడేసరికి బంధాలు బంధుత్వాలు గుర్తుకువచ్చాయా ఏంటి ? గంట క్రితం ఆ బంధాలు అన్ని మర్చిపోయి మమ్మల్ని జైలుకి పంపుతానని బెదిరించింది అలాంటి దానికి నేను ఇప్పుడు హారతి ఇవ్వాలా? నేను ఇవ్వను అంటుంది.

Baby: పిల్లలకు ఏడో నెల వచ్చిన దగ్గరనుండి సంత్సరం నిండేవరకు ఇలా ఆడించండి!!
సీన్ లోకి తులసి :

ఇంతలో లాస్య పక్కనే ఉన్న తులసిని సీన్‌లోకి లాగి తులసీ.. నా మంగళసూత్రం ఎలా ఉంది? అని మంగళసూత్రం చూపిస్తుంది. బాగుండాల్సింది మంగళ సూత్రం కాదు.. అది కట్టిన వాడితో నీ కాపురం అని తులసి పంచ్ డైలాగ్ వేస్తుంది. నందుకి నాపై గుండెల నిండా ప్రేమ ఉందిలే, నా కాపురం నేను చూసుకుంటాలే అంటుంది. అత్తయ్య ఎలాగో హారతి ఇవ్వనంటుంది కదా కనీసం నువ్వైనా నా పెళ్లికి గిఫ్ట్ అనుకుని ఇవ్వు అంటుంది. నేను నీకు ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చేశా.. నీ మెడలో పడిన తాళి నేను ఇచ్చిందే కదా అని అంటుంది.ఆ తరువాత లాస్య.. అనసూయకి క్షమాపణ చెప్పి మీరు హారతి ఇచ్చినా ఇవ్వకపోయినా దీవెనలు ఉంటే చాలు అంటూ నందుతో కలిసి అత్తమామల దీవెనల కోసం వాళ్ల కాళ్లు మొక్కుతారు.

నందు -లాస్యల శోభనం జరిగేనా?

ఇప్పటికైనా నిజాయితీగా ఉండి,లాస్యతో అయినా సరిగ్గా కాపురం చేయి అని అంటాడు పరందామయ్య. ఆ తరువాత తులసి పిల్లలు, కోడళ్ళు అయిష్టంగానే నందు, లాస్యలకు కంగ్రాట్స్ చెప్తారు.నందు భావోద్వేగంతో లాస్యను ఎగాదిగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్ అయితే మరి దారుణం అనే చెప్పాలి.పెళ్లి అయ్యాక జరిగే కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే అది శోభనమే. నందు, లాస్యలు శోభనం గదిలో రొమాన్స్ చేసుకుంటుంటే పాపం బయట ఉన్న తులసి పరిస్థితి ఏంటో ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. వాళ్ళిద్దరి శోభనం కూడా అయిపోతుందా… లేక వాయిదా పడుతుందా అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Share
Ram

Recent Posts

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 mins ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

19 mins ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

1 hour ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

2 hours ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

3 hours ago

Pakka Commercial: భారీగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే గోపీచంద్ ఎంత రాబ‌ట్టాలి?

Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా…

3 hours ago