Gruhalakshmi: అనుకున్నంత అయిపోయిందిగా… నందు, లాస్య పెళ్లి…తులసి పయనం ఎటువైపో..?

Share

Gruhalakshmi: నందు,లాస్యల పెళ్లి రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో నందు కనిపించకపోవడంతో తులసి ఫ్యామిలీపై ఫైర్ అవుతుంది లాస్య. నందుని అతని ఫ్యామిలీని జైలుకి పంపిస్తానని బెదిరించడంతో తులసికి చిర్రెత్తుకొస్తుంది.నా ఫ్యామిలీతో పాటు నువ్వు కూడా జైలుకి వెళ్తావ్ అంటూ రివర్స్ అవుతుంది. ఇక నేటి ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ఈ గొడవను ఇక్కడితో వదిలేద్దాం.ఇంకా నా కుటుంబం జోలికొస్తే పెళ్లి మండపం పీకి అవతల పడేస్తా అంటూ లాస్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది తులసి.ఈలోపు తులసి ఫోన్‌కి నందు ఫోన్ చేస్తాడు. ‘ఎక్కడున్నారు మీరు? అంటూ అరుస్తుంది తులసి. మీరు ఎక్కడున్నా కానీ వెంటనే ఇక్కడకు రావాలి.మీ వల్ల నా కుటుంబం మొత్తం నింద మోయాల్సి వస్తుందని అరుస్తుంది.

నందు మండపానికి వస్తాడా?

తులసి మాటలు విన్న నందు నీతో ఒంటరిగా మాట్లాడాలని అనడంతో మీరు నాతో ఏం మాట్లాడాలనుకున్నా ముందు ఇక్కడికి వచ్చి మాట్లాడండి.ముందు ఇంటికి రండి అంటుంది. ఇంతలో లాస్య తులసి ఫోన్ లాక్కుని ‘ఏంటి నందు నాటకాలు ఆడుతున్నావా అనేలోపే నందు మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు.దీంతో అనసూయ సీన్ లోకి వచ్చి నా కొడుకుకి నిన్ను పెళ్లి చేసుకోవడం కాదు కదా కనీసం నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు అని నీకు సిగ్గు ఉంటే.. నా కొడుకుని వదిలెయ్ అని అంటుంది. దీంతో లాస్య.. నో వే అంటూ గట్టిగా అరుస్తుంది.
ఇంతలో నందు పెళ్లి మండపం దగ్గరకు రాగానే ఎక్కడకు వెళ్లారని నిలదీస్తుంది తులసి. లాస్య కూడా ఏమైపోయావ్.. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు.. నీకోసం ఏడుస్తూ, అందరితో గొడవ పడుతున్నాను.. చెప్పు నందు చెప్పు’ అంటుండగా నందు మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగానే ఉంటాడు.

Karthika Deepam:వంటలక్క పిండి వంటలు… డాక్టర్ బాబు ట్యూషన్ వర్క్ ట్ అయ్యేనా..??
లాస్యను పెళ్లి చేసుకోవడం నందుకు ఇష్టమేనా?

మరో వైపు లాస్య పెళ్లి ముహూర్తం దాటిపోతుంది.రా నందు వెళ్లి పెళ్లి చేసుకుందాం.. అని నందు చేయిపట్టుకుని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుంది. నందు మాత్రం కదలకుండా అక్కడే ఉండిపోవడంతో పాటు లాస్య చేతిని బలవంతంగా విడిపించుకోవడంతో లాస్య షాక్ అవుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నన్ను వదిలెయ్.. ఈ పెళ్లి నా వల్లకాదు.. ఈ పెళ్లికి నేను సిద్ధంగా లేను’ అని గట్టిగా చెప్తాడు.అసలు ఎందుకు పెళ్లి చేసుకోవు? ఎందుకు పెళ్లికి సిద్ధంగా లేవు..నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్ ఏం చెప్తే దానికి నేను తల ఊపుతానని అనుకుంటున్నావా? ఏంటి నువ్వు పెళ్లి చేసుకోకపోతే కోర్టుకి లాగుతా, నీ పరువు మొత్తం తీస్తా.. నువ్ లాస్య ప్రేమనే చూశావ్. ఈ లాస్య అంతే ఈజీగా ప్రాణాలను కూడా తీస్తుంది? అని బెదిరిస్తుంది. లాస్య మాటలు విన్న తులసి నోర్ముయ్ అంటూ సీన్‌‌లోకి వస్తుంది. నందుని లాస్యని కలపి ఏకేస్తుంది తులసి. అసలు మీకు సిగ్గు ఉందా? మీ వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది.. మీ మధ్యలోకి రావడం నాకు ఇష్టం లేదు.. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఈవిడగారంటే చాలా ఇష్టం కదా.. ఈవిడ కోసం కట్టుకున్న భార్యకు కూడా విడాకులు ఇచ్చి, కుటుంబాన్ని కూడా వదిలేశారు అని నందుకు చురకలు పెడుతుంది. అలాగే పెళ్లైన మగాడ్ని ప్రేమించి నీ జీవితాన్ని జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.

నందుని వదిలేయమన్న తులసి !లాస్య వదిలేస్తుందా?

9 ఏళ్ల తరువాత బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మరి పెళ్లి చేసుకోవడమా? మీ ఇద్దరూ చేసింది నటనే అంటూ తెగ క్లాస్ పీకుతోంది లాస్యా.. ఆయనకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆయన్ని వదిలేయొచ్చు కదా… బలవంతం చేయడం ఎందుకు అని తులసి అనడంతో.. ‘నేను ఏం చేయాలో నాకు తెలుసు మధ్యలో మాట్లాడకు అంటుంది. ఇష్టం లేకుండా నందును పెళ్లి చేసుకుంటే నా వాళ్లని సుఖంగా ఉండనివ్వవు. బలవంతంగా పెళ్లి చేసుకుంటే.. ఈయన నిన్ను వదిలేయడని గ్యారంటీ ఏంటి? గెలవడం నేర్చుకో.. లాక్కోవడం కాదు..అయితే అటు లేదంటే ఇటు ఏదొక నిర్ణయం తీసుకోండి అని ప్రాధేయపడి ఏడుస్తుంది తులసి. అయితే లాస్య.. నీకు ఔనో కాదో అనే ఆప్షన్స్ లేవు.. ఉన్నది ఒక్కటే ఆప్షన్ పెళ్లి చేసుకోవడం.. లేదంటే జైలుకి వెళ్లడం’ అని బెదిరిస్తుంది.రేపటి ఎపిసోడ్‌లో నందు లాస్య మెడలో తాళి కడతాడా? లేదా అనేది చూడాలి.


Share

Related posts

Job Notification: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నోటిఫికేషన్..!!

bharani jella

Gunashekhar : గుణశేఖర్ తీస్తున్న శాకుంతలం మీద భయం, క్రేజ్ రెండూ ఎందుకున్నాయో తెలుసా..?

GRK

ఈ రోజు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు విచారణలో కోర్ట్ ఏం చెప్పబోతుంది..?

Siva Prasad